News September 5, 2025
డేంజర్.. మీ పిల్లలు ఇలా నడుస్తున్నారా?

ఏడాది దాటాక పిల్లలు బుడిబుడి అడుగులు వేయడం మొదలు పెడతారు. ఈ క్రమంలో కాలివేళ్లపై నడుస్తారు. కానీ మూడేళ్లు దాటిన తర్వాత కూడా పిల్లలు అలాగే నడుస్తుంటే అది ఆటిజం వ్యాధికి సంకేతం కావొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఆటిజం ఒక న్యూరో డెవలప్‌మెంటల్ కండిషన్. దీనివల్ల ఇంద్రియాల మధ్య సమన్వయం ఉండదు, భావ వ్యక్తీకరణలోపం ఉంటుంది. కాబట్టి చిన్నారుల్లో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది.
Similar News
News September 5, 2025
హైదరాబాద్‌కు సీబీఐ డైరెక్టర్.. కాళేశ్వరం కేసు గురించేనా?

TG: CBI డైరెక్టర్ ప్రవీణ్ సూద్ HYDకు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగిస్తూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. దీంతో ఈ కేసు గురించి చర్చించేందుకే సీబీఐ డైరెక్టర్ వచ్చారా? అనే చర్చ మొదలైంది. మరోవైపు న్యాయవాది వామనరావు దంపతుల హత్య కేసును దర్యాప్తు చేయాలని ఇటీవల సీబీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆ కేసు విషయమై ప్రవీణ్ సూద్ వచ్చారా? అనేది తెలియాల్సి ఉంది.
News September 5, 2025
ఓటీటీలో ట్రెండింగ్ నం.1గా ‘కన్నప్ప’: మంచు విష్ణు

మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన ‘కన్నప్ప’ చిత్రం నిన్నటి నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఓటీటీలోనూ ఈ చిత్రానికి మంచి ఆదరణ లభిస్తోందని విష్ణు ట్వీట్ చేశారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో నంబర్ 1గా ట్రెండ్ అవుతోందని తెలిపారు. ప్రేక్షకులు చూపుతున్న ఆదరణకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ముకేశ్ కుమార్ సింగ్ తెరకెక్కించిన ఈ చిత్రంలో మోహన్ బాబు, ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ కీలక పాత్రల్లో నటించారు.
News September 5, 2025
రేపు రాష్ట్రానికి 9,039 మెట్రిక్ టన్నుల యూరియా: తుమ్మల

TG: రాష్ట్రంలోని రైతులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉపశమనం కలిగే వార్త చెప్పారు. రేపు రాష్ట్రానికి మరో 9,039 మెట్రిక్ టన్నుల యూరియా రానున్నట్లు తెలిపారు. రానున్న 20 రోజుల్లో 10వేల మెట్రిక్ టన్నుల చొప్పున యూరియా సరఫరా చేయాలని కేంద్రాన్ని కోరినట్లు చెప్పారు. కాగా రాష్ట్రంలో యూరియా కొరత తీవ్రంగా వేధిస్తోంది. బస్తాల కోసం రైతులు దుకాణాల ముందు రోజులకొద్దీ వేచిచూస్తున్నారు.