News October 21, 2024
DANGER BELL: కుప్పకూలనున్న అమెరికన్ బ్యాంకింగ్ వ్యవస్థ?

ప్రతి ఎకానమీకి బ్యాంకింగ్ సిస్టమే పట్టుగొమ్మ. దానికే చీడపడితే ఆ దేశం దివాలా తీయడం ఖాయం! భూతల స్వర్గంగా భ్రమించే అమెరికా ప్రస్తుత పరిస్థితి ఇదే. ఎందుకంటే US బ్యాంకుల నష్టాలు చరిత్రలో ఎన్నడూ లేనంత ఎక్కువగా ఉన్నాయి. 2008లో సబ్‌ప్రైమ్ క్రైసిస్ టైమ్‌లో $75bns లాసెస్తోనే ప్రపంచం అతలాకుతలమైంది. 2024 నాటికి ఇవి 7 రెట్లు పెరిగి $500bnsకు చేరాయి. చాలా బ్యాంకులు లిక్విడ్ క్యాష్ లేక తల్లడిల్లుతున్నాయి.
Similar News
News January 12, 2026
పండుగల్లో ఇలా మెరిసిపోండి

* ముల్తానీ మట్టి, రోజ్‌వాటర్ కలిపి ప్యాక్ సిద్ధం చేసుకోవాలి. ఈ ప్యాక్‌ని ముఖానికి అప్లై చేసి, ఆరిన తర్వాత నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి. ఇది మీ ముఖానికి చల్లదనంతో పాటు మెరుపునిస్తుంది.
* పుదీనా ఫేస్ ప్యాక్ చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది. పుదీనా ఆకులను మెత్తగా గ్రైండ్ చేసి ముఖానికి రాసుకోవాలి. ప్యాక్ ఆరిపోయాక చల్లని నీటితో ముఖాన్ని కడగాలి. దీని వల్ల ముఖం తాజాగా మారుతుంది.
News January 12, 2026
అగ్నివీర్ వాయు పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

<
News January 12, 2026
మినుములో పల్లాకు తెగులు లక్షణాలు – నష్టాలు

మినుము పంటలో పల్లాకు తెగులు సోకిన తొలి దశలో లేత పసుపు రంగు మచ్చలు ఏర్పడి, క్రమంగా అవి ముదురు పసుపు రంగులోకి మారతాయి. కొన్నిసార్లు ముదురు గోధుమ లేదా నలుపు రంగు మచ్చలు కూడా కనిపిస్తాయి. ఈ తెగులు వల్ల మొక్కలు గిడసబారి, ఎదుగుదల కుంటుపడుతుంది. పూత ఆలస్యంగా వస్తుంది లేదా ఎండిపోతుంది. కాయలు తక్కువ సంఖ్యలో వచ్చి వాటిపై కూడా మచ్చలు వస్తాయి. ఫలితంగా గింజల నాణ్యత, పరిమాణం తగ్గిపోతుంది.


