News February 25, 2025
డేంజర్ బెల్స్: పెరుగుతున్న సెకండరీ ఇన్ఫెర్టిలిటీ

దంపతులు రెండో బిడ్డను కనడం కష్టమవుతోందని వైద్యులు అంటున్నారు. ఏళ్లు గడిచే కొద్దీ సెకండరీ ఇన్ఫెర్టిలిటీ రేటు పెరుగుతోందని ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతమిది 30%కి చేరిందని, అనారోగ్యం, జీవనశైలి సమస్యలే ఇందుకు ప్రధాన కారణాలని చెప్తున్నారు. దీంతో పురుషుల్లో వీర్యం నాణ్యత, మహిళల అండాశయాల్లో గుడ్లు తగ్గుతున్నాయని వివరించారు. BP, షుగర్, థైరాయిడ్, ఒబెసిటీ, PCOD వంటివి సమస్యను పెంచుతున్నాయని చెప్పారు.
Similar News
News February 25, 2025
పెళ్లి చేసుకోండి.. లేదంటే ఉద్యోగం తీసేస్తాం: కంపెనీ వార్నింగ్

బాగా పనిచేయకపోతే ఉద్యోగం ఊస్టింగే అని కంపెనీలు వార్నింగ్ ఇవ్వడం సహజం. అయితే చైనాలో ‘షాన్డాంగ్’ అనే సంస్థ తమ ఒంటరి సిబ్బందిని SEP నాటికి పెళ్లి చేసుకోవాలని ఆదేశించింది. లేదంటే జాబ్ వదులుకోవాల్సిందేనని హెచ్చరించింది. దీనిపై GOVT అధికారులు మందలించినా కంపెనీ తన నిర్ణయాన్ని సమర్థించుకుంది. దేశంలో వివాహ రేటును పెంచడానికే ఇలా చేశామంది. కాగా చైనాలో వివాహ, జనన రేటు భారీగా పడిపోయిన విషయం తెలిసిందే.
News February 25, 2025
SLBC టన్నెల్లో 10వేల క్యూబిక్ మీటర్ల బురద?

SLBC టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. టన్నెల్లో 15 అడుగుల ఎత్తులో10వేల క్యూబిక్ మీటర్ల బురద ఉందని ఇంజినీర్లు అంచనా వేశారు. దానిని బయటికి తీసేందుకు కన్వేయర్ బెల్ట్కు మరమ్మతులు చేస్తున్నారు. రేపు సాయంత్రానికి ఈ మరమ్మతు పనులు పూర్తి కానున్నట్లు తెలుస్తోంది. దీని ద్వారా గంటకు 800 టన్నుల బురద బయటకు తోడే అవకాశముంటుందని సమాచారం.
News February 25, 2025
నైట్ బ్రషింగ్ చేయకపోతే ప్రమాదమే: అధ్యయనం

రాత్రుళ్లు బ్రష్ చేయడం ఎంతో మేలని వైద్యులు సూచిస్తున్నారు. కార్డియోవాస్కులర్ వ్యాధుల (CVD) ప్రమాదాన్ని నైట్ బ్రషింగ్ తగ్గిస్తుందని ఇటీవలి అధ్యయనంలో వెల్లడైంది. రాత్రిపూట బ్రషింగ్ను నిర్లక్ష్యం చేసిన వారితో పోలిస్తే, రోజుకు రెండు సార్లు పళ్లు తోముకునే వ్యక్తుల్లో CVDల సంభవం గణనీయంగా తగ్గినట్లు తేలింది. బ్రషింగ్ నిర్లక్ష్యం చేస్తే నోటి బ్యాక్టీరియా వృద్ధి చెంది గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది.