News November 11, 2024
DANGER: పిల్లలకు కూల్‌డ్రింక్స్ కొనిస్తున్నారా?

పిల్లలకు కూల్ డ్రింక్స్ కొనివ్వొద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు. తయారీదారులే కార్బోనేటెడ్ శీతల పానీయలను పిల్లలకు సిఫార్సు చేయొద్దని వాటిపై రాస్తున్నారని తెలిపారు. పిల్లలు కెఫిన్ కలిపిన సోడాను తీసుకోవడం వల్ల అనారోగ్యానికి గురవుతారని పలు అధ్యయనాల్లో తేలిందన్నారు. జ్ఞాపకశక్తి తగ్గడం, మద్యం తాగాలనే ఆలోచనలు రావడం, అధిక బరువు, ఊబకాయం, టైప్ 2 మధుమేహం వంటి రుగ్మతలు వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు.
Similar News
News September 15, 2025
ఈ జపనీస్ టెక్నిక్‌తో హెల్తీ స్కిన్

జపనీయులు చర్మం ఆరోగ్యంగా ఉండేందుకు 4-2-4 టెక్నిక్ యూజ్ చేస్తారు. ముందుగా ఆయిల్ బేస్డ్ క్లెన్సర్‌తో ముఖాన్ని 4నిమిషాలు మసాజ్ చేసుకోవాలి. తర్వాత వాటర్ బేస్డ్ క్లెన్సర్‌తో 2నిమిషాలు సున్నితంగా ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. చివర్లో 2 నిమిషాలు వేడినీటితో, మరో 2 నిమిషాలు చల్లటి నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. ఈ పద్ధతి వల్ల చర్మానికి డీప్ క్లెన్సింగ్ అవుతుంది. రక్తప్రసరణ పెరిగి చర్మం బిగుతుగా మారుతుంది.
News September 15, 2025
పీసీఓఎస్‌తో తగ్గుతున్న ప్రతిస్పందన వేగం

ప్రస్తుతం చాలామంది మహిళలు PCOSతో బాధపడుతున్నారు. వీరిలో షుగర్, ఊబకాయం, గుండె జబ్బుల ప్రమాదం ఎక్కువ. అయితే PCOS బాధితుల్లో ప్రతిస్పందన వేగం తగ్గుతున్నట్లు IITబాంబే నిర్వహించిన ఓ పరిశోధనలో ఈ విషయం బయటపడింది. ఏకాగ్రత తగ్గడం, నెమ్మదిగా స్పందించడం PCOS బాధితుల్లో గుర్తించినట్లు పరిశోధకులు వెల్లడించారు. ఇన్సులిన్ హెచ్చుతగ్గులతో మెదడు కణజాలం ప్రభావితమై కాగ్నిటివ్ హెల్త్ దెబ్బతింటున్నట్లు తెలిపారు.
News September 15, 2025
30L తల్లి పాలను దానం చేసిన గుత్తా జ్వాల

భారత మాజీ బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాల మంచి మనసు చాటుకున్నారు. తల్లి పాలకు దూరమైన శిశువులు అనారోగ్యం బారిన పడకుండా ఆమె తన పాలను దానం చేశారు. ఏప్రిల్‌లో బిడ్డను కన్న జ్వాల ఇప్పటివరకు దాదాపుగా 30L పాలను మిల్క్ బ్యాంక్‌కు అందించారు. ఈ విషయాన్ని ఆమె SM వేదికగా పంచుకున్నారు. ఇది చూసిన నెటిజన్లు జ్వాల విశాల హృదయానికి ఫిదా అవుతున్నారు. ఆమె అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారంటూ ప్రశంసిస్తున్నారు.