News November 6, 2025

DANGER: CT స్కాన్ చేయిస్తున్నారా?

image

ఏదైనా చిన్న సమస్యతో ఆస్పత్రికి వెళ్తే సీటీ స్కాన్, MRIలను వైద్యులు సజెస్ట్ చేస్తుంటారు. అయితే CT స్కాన్‌ల నుంచి వెలువడే రేడియేషన్ వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భవిష్యత్తులో వచ్చే మొత్తం క్యాన్సర్ సంఖ్యల్లో CT స్కాన్ క్యాన్సర్లు 5 శాతానికి చేరొచ్చని అమెరికాలో జరిగిన అధ్యయనంలో తెలిసినట్లు పేర్కొన్నారు. CT స్కాన్‌ల వినియోగం, డోసులు తగ్గించకపోతే ప్రమాదమేనంటున్నారు.

Similar News

News November 6, 2025

బెట్టింగ్ యాప్ కేసు.. రైనా, ధవన్ ఆస్తులు అటాచ్

image

ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. టీమ్ ఇండియా మాజీ క్రికెటర్లు సురేశ్ రైనా, శిఖర్ ధవన్‌కు చెందిన రూ.11.14 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఇలాంటి యాప్‌లకు ప్రచారం చేయడం వెనుక ఏదైనా ఆర్థికపరమైన కుట్ర ఉందా అనే కోణంలో ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే వారిద్దరినీ అధికారులు విచారించారు.

News November 6, 2025

జుట్టుకు మసాజ్ చేస్తున్నారా?

image

ప్రస్తుతం కాలుష్యం, అనారోగ్యకరమైన జీవనవిధానాల వల్ల చాలామందిలో జుట్టు ఎక్కువగా రాలుతోంది. అలాగే కాలంతో సంబంధం లేకుండా చుండ్రు సమస్య కూడా వేధిస్తుంది. వారానికోసారి హెయిర్‌ మసాజ్‌ చేసుకోవడం వల్ల కుదుళ్లకు దృఢత్వాన్ని చేకూర్చడంతో పాటు జుట్టు ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చంటున్నారు నిపుణులు. కుదుళ్ల వద్ద చర్మం పొలుసులుగా ఊడిపోవడం, పొడిబారిపోవడం, జుట్టు ప్యాచుల్లా ఊడిపోవడం వంటి వాటికి మసాజ్ చక్కటి పరిష్కారం.

News November 6, 2025

గ్రాముకు రూ.9వేల లాభం

image

RBI తీసుకొచ్చిన సావరిన్ గోల్డ్ బాండ్స్(SGB) మదుపర్లకు భారీ లాభాలను అందించాయి. 2017 NOV 6న విడుదల చేసిన సిరీస్‌-VI బాండ్లకు అప్పట్లో గ్రాము ₹2,895గా(ఆన్‌లైన్‌లో ₹50 డిస్కౌంట్) నిర్ణయించారు. 8 ఏళ్ల కాలవ్యవధి పూర్తికావడంతో ఆ బాండ్లు మెచ్యూరిటీకి వచ్చాయి. ప్రస్తుతం వాటి ధరను ₹12,066గా RBI నిర్ణయించింది. అంటే ఒక్కో గ్రాముపై ₹9,121 లాభం వచ్చింది. దీనికి ఏటా చెల్లించే 2.5% వడ్డీ అదనం.