News October 25, 2024

DANGER: సమోసా, చిప్స్, ఫాస్ట్‌ఫుడ్స్‌తో డయాబెటిస్

image

అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ మధుమేహానికి దారి తీస్తోందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ తేల్చింది. సమోసా, పకోడి, ఫ్రైడ్ చికెన్, చిప్స్, కేక్స్, ఫాస్ట్ ఫుడ్స్ రక్తంలో చక్కెర స్థాయులను పెంచుతున్నట్లు నిర్ధారించింది. ఇవి శరీరంలో హానికరమైన అడ్వాన్స్‌డ్ గ్లైకేషన్ ఎండ్ ప్రొడక్ట్స్‌గా మారి ఇన్సులిన్ నిరోధకతను దెబ్బతీస్తున్నాయి. దీంతో టైప్-2 మధుమేహం, ఊబకాయానికి దారితీస్తున్నట్లు పరిశోధకులు తెలిపారు.

Similar News

News October 25, 2024

ANR అవార్డ్స్-2024 వేడుకకు అమితాబ్, చిరు

image

అక్కినేని నాగేశ్వర్‌రావు శత జయంతిని ఘనంగా నిర్వహించేందుకు నాగార్జున సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే ANR అవార్డ్స్-2024 ప్రదానోత్సవ కార్యక్రమానికి ఇద్దరు మెగాస్టార్లు రానున్నారు. బాలీవుడ్ నుంచి అమితాబ్ బచ్చన్, టాలీవుడ్ నుంచి చిరంజీవి ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. వారిద్దరినీ ఆహ్వానించినట్లు నాగార్జున ప్రకటించారు. కార్యక్రమం ఈనెల 28న జరగనుంది. ANR నేషనల్ అవార్డు చిరు అందుకోనున్నారు.

News October 25, 2024

మరో రూ.300 కోట్ల ఆరోగ్య శ్రీ బకాయిలు చెల్లించాం: మంత్రి

image

AP: పేద ప్రజల ఆరోగ్య సంరక్షణకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ‘ఎన్టీఆర్ వైద్యసేవ (ఆరోగ్యశ్రీ) కింద నెట్‌వర్క్ ఆసుపత్రులకు మాజీ సీఎం జగన్ పెట్టిన రూ.2500కోట్ల బకాయిలలో మరో రూ.300 కోట్లు ఇవాళ చెల్లించాం. రాష్ట్రం అప్పుల నుంచి అభివృద్ధి వైపు, సంక్షోభం నుంచి సంక్షేమం దిశగా పయనిస్తోంది’ అని ట్వీట్ చేశారు.

News October 25, 2024

జగన్ ఆస్తులతో షర్మిలకు సంబంధమేంటి?: వైసీపీ

image

AP: సీఎం చంద్రబాబు డైరెక్షన్‌లో విజయమ్మను ముందుపెట్టి జగన్‌ను న్యాయపరంగా ఇబ్బంది పెట్టాలని షర్మిల కుట్ర చేస్తోందని వైసీపీ ఆరోపించింది. ‘కుటుంబ ఆస్తులన్నింటినీ YSR జీవించి ఉన్నప్పుడే పంపకాలు చేసేశారు. కానీ చెల్లి షర్మిలపై ఉన్న ప్రేమాభిమానాలతో జగన్ తాను సొంతంగా సంపాదించుకున్న ఆస్తుల్లోనూ వాటా ఇచ్చేందుకు ముందుకొచ్చారు’ అని ట్వీట్ చేసింది. ‘శాడిస్ట్ చంద్రబాబు’ అని పేర్కొంది.