News August 23, 2025

DANGER: వాట్సాప్‌లో ఈ మెసేజ్‌పై క్లిక్ చేయొద్దు!

image

కేటుగాళ్లు కొత్త ఎత్తుగడతో మోసాలకు పాల్పడుతున్నారు. ఇటీవలే జరిగిన వెడ్డింగ్ ఇన్విటేషన్ స్కామ్‌పై నెట్టింట చర్చ జరుగుతోంది. MHలోని హింగోలికి చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగికి వాట్సాప్‌లో APKఫైల్‌తో కూడిన మ్యారేజ్ ఇన్విటేషన్ వచ్చింది. ఫైల్‌ను క్లిక్ చేయగానే మొబైల్‌ను హ్యాక్ చేసి బ్యాంక్ అకౌంట్‌లోని రూ.1.90లక్షలు కాజేశారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి మెసేజ్‌లను క్లిక్ చేయకపోవడం మంచిది.

Similar News

News August 23, 2025

రేపటి నుంచి ఆల్ ఇండియా స్పీకర్ల కాన్ఫరెన్స్

image

ఢిల్లీ అసెంబ్లీ భవనంలో ఆది, సోమవారాల్లో ఆల్ ఇండియా స్పీకర్స్ కాన్ఫరెన్స్ జరగనుంది. ఈ 2 రోజుల సదస్సును హోంమంత్రి అమిత్ షా ప్రారంభించనున్నారు. సోమవారం ముగింపు కార్యక్రమానికి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా హాజరుకానున్నారు. ఈ కాన్ఫరెన్స్‌లో తెలుగు రాష్ట్రాల సభాపతులతో పాటు మరో 30 మంది స్పీకర్లు పాల్గొననున్నారు.

News August 23, 2025

స్థానిక సంస్థల ఎన్నికల కోసం కమిటీ

image

TG: స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల ఖరారు కోసం రాష్ట్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీలో మంత్రులు ఉత్తమ్ కుమార్, భట్టి, పొన్నం, సీతక్క సభ్యులుగా ఉన్నారు. ఈ నెల 28వ తేదీ లోగా ఈ కమిటీ నివేదిక ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. మరోవైపు, ఈ నెల 29న క్యాబినెట్ సమావేశం నిర్వహించాలని PAC భేటీలో నిర్ణయించారు.

News August 23, 2025

బొద్దుగా ఉన్నవారే అక్కడ హీరోలు!

image

మీరు బొద్దుగా ఉన్నారని, పొట్ట ఉందని బాధపడుతున్నారా? అయితే అలాంటివారిని ఇష్టపడే చోటు ఒకటుంది. ఇథియోపియాలోని బోడి తెగలో భారీ పొట్ట ఉంటే ప్రతిష్ఠ, ఆకర్షణకు చిహ్నంగా భావిస్తారు. కయోల్ వేడుక కోసం యువకులు 6 నెలల పాటు ఒంటరిగా శారీరక శ్రమ లేకుండా ఆహారం తీసుకొని బొద్దుగా మారతారు. అందులో ఎక్కువ బొజ్జ ఉన్నవారిని విజేతగా ప్రకటించి గౌరవిస్తారు. తెగలోని వారికి వీరే హీరోలుగా మారతారు.