News March 31, 2024
DANGER: మీ ఫోన్‌లో ఇలా చేస్తున్నారా?

మీ ఫోన్లలో ఫేస్‌బుక్, X సహా సోషల్ మీడియా అకౌంట్లు, యాప్‌లను లాగిన్ అయ్యేటప్పుడు పాస్‌వర్డ్‌లు, ఇతర వివరాల ఆటోఫిల్ ఆప్షన్‌కు ఓకే చేస్తున్నారా? అయితే మీరు డేంజర్‌లో ఉన్నట్లే. దీనివల్ల మొబైల్ OSలో పాస్‌వర్డ్ మేనేజర్ల సామర్థ్యం తగ్గిపోతుందని, సైబర్ నేరగాళ్లు సులభంగా దాడి చేస్తారని IIIT HYD ప్రొఫెసర్ అంకిత్ గంగ్వాల్ చేసిన పరిశోధనలో తేలింది. అందుకే సొంతంగా పాస్‌వర్డ్ టైప్ చేయాలని సూచిస్తున్నారు.
Similar News
News March 7, 2026
VIRAL: సిస్టర్‌తో సీఎం నితీశ్

ఇందులో కొత్తేముంది అనుకుంటున్నారా? దేశ రాజకీయాలను శాసించే స్థాయిలో ఉన్న బిహార్ సీఎం నితీశ్ సోదరి సామాన్య జీవనం గడపడం విశేషమే. కుర్చీలో కూర్చుంటే కోట్లు కూడబెట్టే కాలమిది. కానీ 20 ఏళ్లుగా సీఎంగా ఉన్నా.. ఆయన కూడా ఆస్తులు వెనకేసుకోలేదు. నితీశ్ ఆస్తులు రూ.1.66 కోట్లే. హోలీ రోజు తన అక్క ఉషా దేవిని ఆయన కలిసిన ఫొటో వైరలవుతోంది. పీఎం మోదీ, యూపీ సీఎం యోగి కుటుంబీకులు సైతం ఇలాగే నిరాడంబరంగా ఉండటం విశేషం.
News March 7, 2026
భారత్ వద్ద 4వేల కోట్ల లీటర్ల ముడి చమురు!

భారత్ వద్ద 25 రోజులకే ఆయిల్ రిజర్వులు ఉన్నాయన్న వార్తలను ప్రభుత్వం ఖండించింది. ప్రస్తుతం భారత్ వద్ద సుమారు 4,000 కోట్ల లీటర్ల (250 మిలియన్ బ్యారెళ్ల) ముడి చమురు, పెట్రోలియం నిల్వలు ఉన్నాయని తెలిపింది. ఇవి పూర్తి స్థాయిలో 7 – 8 వారాలకు సరిపోతాయని వివరించింది. విశాఖపట్నం, మంగళూరు, పడూరులోని భూగర్భ కేంద్రాలు & టెర్మినళ్లలో ఈ నిల్వలు సురక్షితంగా ఉన్నాయని వెల్లడించింది. తప్పుడు వార్తలు నమ్మొద్దంది.
News March 7, 2026
AIతో భారీగా ఉద్యోగాలేమీ పోలేదు: ఆంథ్రోపిక్ రిపోర్ట్

ఏఐ వల్ల భారీ సంఖ్యలో ఉద్యోగాలు పోలేదని ఆంథ్రోపిక్ వెల్లడించింది. టెక్నాలజీ నైపుణ్యాలు అవసరమయ్యే జాబ్స్‌లో యువ ఉద్యోగుల నియామకాలు తగ్గాయని ఓ నివేదికలో తెలిపింది. కోడింగ్, ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్, అనాలసిస్, రొటీన్ డిజిటల్ డ్యూటీలను నిర్వర్తించే వైట్ కాలర్ ఉద్యోగాల్లో ఏఐ వినియోగం ఎక్కువని చెప్పుకొచ్చింది. మెకానిక్‌లు, వంటవాళ్లు.. ఇలా మాన్యువల్ సామర్థ్యాలు అవసరమయ్యే ఉద్యోగాలకు సమస్య లేదని పేర్కొంది.


