News October 1, 2024

DANGER: ప్యాక్ చేసిన ఫుడ్ తింటున్నారా?

image

ఫుడ్ ప్యాకేజింగ్, ప్లాస్టిక్ టేబుల్‌వేర్లలో 200 రసాయనాలు ఉన్నాయని, అవి బ్రెస్ట్ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయని ఓ పరిశోధనలో వెల్లడైంది. ఈ హానికరమైన రసాయనాలను కలిగి ఉన్న ఉత్పత్తులలో కార్డ్‌బోర్డ్, ప్లాస్టిక్ ర్యాప్, ప్లాస్టిక్ ఉన్నాయి. వీటిలో PFAలు, బిస్ఫినాల్స్, థాలేట్‌ వంటి ప్రమాదకరమైన రసాయనాలున్నాయి. రోజువారీ ఉత్పత్తుల్లో వీటిని తగ్గించడానికి నివారణ చర్యలు తీసుకోవాలని పరిశోధకులు సూచించారు.

Similar News

News October 26, 2025

అమ్మకిచ్చిన మాట కోసం 150 డిగ్రీలు చేశాడు!

image

చెన్నై ప్రొఫెసర్ డా.పార్థిబన్ ఇప్పటివరకు 150 డిగ్రీ పట్టాలు అందుకున్నారు. తొలిసారి డిగ్రీ పాసైనప్పుడు తక్కువ మార్కులు రావడంతో తన తల్లి బాధపడిందని, దీంతో టాప్ ర్యాంక్ మార్కులు తెచ్చుకుంటానని ఆమెకు వాగ్దానం చేసినట్లు ఆయన తెలిపారు. 1981 నుంచి చదువుతున్నారు. చదవడాన్ని తాను ఎంజాయ్ చేస్తున్నానని, 200 డిగ్రీలు చేయడమే లక్ష్యమని పేర్కొన్నారు. ఆయన చదివిన వాటిలో MA, MPhil, MSc. PG, PhD వంటి కోర్సులున్నాయి.

News October 26, 2025

అసలైన భక్తులు ఎవరంటే?

image

లాభాపేక్షతో భగవంతుణ్ని సేవించేవారు వ్యాపారస్తులు అవుతారు. వారు దేవుణ్ని తన వ్యాపార భాగస్వామిగా భావించి, ప్రతిఫలాన్ని ఆశిస్తారు. కానీ నిజమైన భక్తులు ఎలాంటి స్వార్థం, ఆశయం లేకుండా ‘నేనే నీ దాసుడను, నీవు నా స్వామివి’ అనే నిష్కల్మష భావనతో సేవలు చేస్తారు. ప్రతిఫలం ఆశించకుండా, మనస్సును భగవంతునిపైనే ఉంచి భక్తి చూపుతారు. స్వామి సంతోషమే తన సంతోషంగా భావించి, అందరిలోనూ ఆనందాన్ని నింపుతారు. <<-se>>#Daivam<<>>

News October 26, 2025

భగవంతుని నామస్మరణ గొప్పతనం ఏంటంటే..?

image

భగవంతుడి నామస్మరణ ఎంతో మహత్తరమైనది. ఆ నామాన్ని భక్తితో, వైరాగ్యంతో మాత్రమే కాక, కోపంతో, అలవాటుగా, అనాలోచితంగా పలికినా కూడా సకల శుభాలనూ, మోక్ష ఫలాలనూ అందిస్తుంది. భావనతో సంబంధం లేకుండా ఆ నామ సంకీర్తన నిరంతర శుద్ధిని కలిగిస్తుంది. అంతిమంగా జీవునికి మేలు చేకూర్చుతుంది. అందుకే ఆయన పేరుతో ఆయణ్ను దూషించినా.. అది దైవ నామ స్మరణే అవుతుందని పండితులు చెబుతుంటారు. భగవత్ నామానికి ఉన్న అద్భుత శక్తి ఇది.<<-se>>#Bakthi<<>>