News January 30, 2026
DANGER: HYDలో బతకడం కష్టమే..!

హైదరాబాద్‌లో కాలుష్యం రోజురోజుకూ పెరుగుతోంది. గాలి నాణ్యత విషయంలో HYD తాజాగా బెంగళూరు, చెన్నై నగరాలను దాటినట్లు కాలుష్య నియంత్రణ మండలి (PCB) వెల్లడించింది. మెట్రో నగరాల కాలుష్య గణాంకాల్లో హైదరాబాద్ ఆందోళనకర స్థాయిలో ఉన్నట్లు నివేదికలో పేర్కొంది. గతంలో నగరంలో 7 కాలుష్య హాట్‌స్పాట్లు ఉన్నాయని, ప్రస్తుతం పరిస్థితి భయానకంగా మారుతోందని అధికారులు తెలిపారు. కాగా ఇవాళ గాజులరామారంలో ఉదయం AQ 394గా నమోదైంది.
Similar News
News January 30, 2026
HYDలో చట్టం చుట్టూ లొసుగులు!

అగ్నిమాపక శాఖ నోటీసులు ఇస్తుంది.. కానీ భవనాన్ని సీజ్ చేసే అధికారం మాత్రం లేదు. అటు GHMCకి అధికారం ఉన్నా ఫైర్ సేఫ్టీ అంశం వారి పరిధిలోకి రాదు. దీంతో నిబంధనలు పాటించని బిల్డర్లు పండుగ చేసుకుంటున్నారు. అందుకే GHMC చట్టాన్ని సవరించి 370-4B సెక్షన్‌లో డిజాస్టర్ మేనేజ్‌మెంట్, ఫైర్ సేఫ్టీని చేర్చాలని ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఈ అధికారం వస్తే HYDRAA అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపగలదని అధికారులు తెలిపారు.
News January 30, 2026
షాకింగ్: HYDలో ఆఫీస్‌లలో NO SAFETY!

HYDలో అగ్నిప్రమాదం జరిగితే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిందేనని ఇటీవలి ఘటనలు కళ్లకుగట్టాయి. విస్తుపోయే నిజం ఏంటంటే GHMC హెడ్ ఆఫీస్, హైడ్రా ఆఫీస్‌లోనూ ఫైర్ సేఫ్టీ రూల్స్ పాటించడం లేదనే విమర్శలున్నాయి. నగరంలో 99.99% భవనాలకు ఫైర్ NOC లేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. నిబంధనలు కాగితాలకు పరిమితం అయ్యాయని పలువురి మాట. చట్టాలు అమలు చేసే కార్యాలయాలే ప్రమాదపు అంచున నిలబడటం శోచనీయం.
News January 30, 2026
HYD: శివారులో వరుస చోరీలు.. దొంగలు దొరికారు

చెంగిచర్లలో వరుస చోరీలతో ప్రజలకు కునుకు లేకుండా చేసిన దొంగలను పోలీసులు పట్టుకున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఊరెళ్లిన సందర్భాన్ని అవకాశంగా తీసుకుని 8 ఇళ్లల్లో చోరీలకు పాల్పడిన నిందితులను మేడిపల్లి పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులపై పూర్తి వివరాలు వెల్లడించేందుకు కాసేపట్లో మేడిపల్లి పోలీస్ స్టేషన్‌లో ఉప్పల్ డీసీపీ, మల్కాజిగిరి క్రైమ్ డీసీపీ ఆధ్వర్యంలో ప్రెస్‌మీట్ నిర్వహించనున్నారు.


