News February 24, 2026

DANGER: HYDలో విష జ్వరాలు!

image

HYDలో దోమలు చిత్రహింసలు పెడుతున్నాయి. మూసీ పరిసరాల్లో లేకున్నా దోమలు విపరీతంగా వ్యాపించాయి. వేలాది దోమలు గుంపులుగా దండయాత్ర చేస్తున్నాయి. ఉప్పల్, చిల్కానగర్‌లో విష జ్వరాలతో ఆస్పత్రుల పాలవుతున్నారు. కోరంటి, గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల్లో చేరినట్లుగా పలువురు తెలిపారు. ప్రైవేట్ ఆస్పత్రు కిక్కిరిసి కనిపిస్తున్నాయి. చిన్న పిల్లలు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. దోమల నివారణకు చర్యలు లేవని ఆరోపిస్తున్నారు.

Similar News

News February 24, 2026

రేపు మార్కాపురం జిల్లాకు CM.. షెడ్యూల్ ఇదే.!

image

CM చంద్రబాబు బుధవారం మార్కాపురం జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో అందుకు సంబంధించిన పర్యటన షెడ్యూల్‌ CMO అధికారులు విడుదల చేశారు. రేపు మధ్యాహ్నం 12:50కి దోర్నాలలోని వెలిగొండ ప్రాజెక్ట్ ఫీడర్ కెనాల్ పనులకు శంకుస్థాపన చేసి, పనులను పరిశీలించి మధ్యాహ్నం 2 గంటల వరకు అక్కడే ఉంటారు. మధ్యాహ్నం 2:30కి మార్కాపురంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం 4:40కి తిరిగి వెలగపూడికి బయలుదేరుతారు.

News February 24, 2026

వంటింటి చిట్కాలు

image

* బిస్కట్లు నిల్వ చేసే డబ్బాలో అడుగున ఒక బ్రెడ్ స్లైస్ ను వేయండి. బిస్కెట్లు మెత్తబడకుండా కరకరలాడుతూ ఉంటాయి.
* చక్కెరను పొడి చేస్తున్నప్పుడు కొన్ని బియ్యపు గింజలు కూడా వేస్తే ముద్ద కాకుండా పొడిలా వస్తుంది.
* నిమ్మజాతి పండ్లూ, టమాటాలు ఫ్రిజ్‌లో పెడితే వాటిల్లోని సువాసన తగ్గిపోతుంది.
* వంటింట్లో వాడే స్పాంజిలూ, మసి బట్టల్ని ఉప్పు వేసిన నీటిలో నానబెట్టి తరువాత ఉతకండి. క్రిములు, దుర్వాసన పోతాయి.

News February 24, 2026

సంగారెడ్డి: చికెన్ కోసం కొట్టుకున్నారు!

image

సదాశివపేట మండలం కోల్కూర్ గ్రామంలో ఆదివారం రాత్రి జరిగిన <<19213297>>వివాహ విందులో<<>> మాంసం ముక్కల విషయంలో గొడవ చెలరేగింది. విందులో ముక్కలు వేయలేదని చాకలి వీరేశం, రంజిత్‌ల మధ్య వివాదం మొదలై, రంజిత్ కర్రతో వీరేశంపై దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన వీరేశంను ఆసుపత్రికి తరలించారు. సీఐ వెంకటేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు.