News January 24, 2026
DANGER.. HYD ఎయిర్ క్యాలిటీ @240

HYDలో ఎయిర్ క్వాలిటీలో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. సాధారణంగా పొగమంచు, చెత్తాచెదారం, వాహనాల పొగతో కాలుష్యం పెరుగుతుంటుంది. డబుల్ డిజిట్‌లో ఉండే ఎయిర్ క్వాలిటీ శనివారం సికింద్రాబాద్‌లో తెల్లవారుజామున 240కి చేరింది. శ్వాసకోశ వ్యాధులు, సైనసైటిస్ ఉన్నవారితో పాటు ప్రజలు వీలైనంత వరకు మాస్కులు ధరించడం మేలని డాక్టర్లు సూచిస్తున్నారు. గత 15 రోజులతో పోలిస్తే గాలి నాణ్యత కాస్త పెరిగింది.
Similar News
News January 24, 2026
HYD: కళల కాణాచి.. రవీంద్రభారతి!

రవీంద్రభారతి చుట్టూ ట్రాఫిక్ హారన్‌ల గోల మధ్యనూ సంగీత సౌరభాలను ప్రశాంతంగా పరిమళింపజేస్తోంది. సాహిత్య కుసుమాలు, నాట్య మయూరాలను పట్నానికి పరిచయం చేస్తోంది. రవీంద్రనాథ్ ఠాగూర్ శతాబ్ది సందర్భంగా 1960 మార్చి 23న శంకుస్థాపన చేశారు. సర్వేపల్లి చేతుల మీదుగా 1961 మే 11న ప్రారంభించారు. మోహమ్మద్ ఫయాజుద్దీన్ డిజైన్ చేశారు. 1989 నుంచి రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖే నిర్వహణ చూస్తోంది. హైదరాబాద్‌కు షాన్ అయింది.
News January 24, 2026
HYD: డేటింగ్‌కు పిలుస్తారు.. ఉన్నదంతా ఊడ్చేస్తారు..!

బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్ ప్రాంతాల్లోని పలు పబ్‌లు అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారుతున్నాయి. అర్ధరాత్రి దాటినా అశ్లీల నృత్యాలు, డ్రగ్స్ విక్రయాలు సాగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల MDMA వంటి మత్తుపదార్థాలు పట్టుబడటం సంచలనం రేపింది. మరోవైపు, డేటింగ్ యాప్‌ల ద్వారా పరిచయమైన యువతులు బాధితులను పబ్‌లకు పిలిపించి, భారీగా బిల్లులు వేయించి పరారవుతున్నట్లు మోసాలు వెలుగు చూస్తున్నాయి.
News January 24, 2026
HYD: ‘జూబ్లీహాల్’ పేరెలా వచ్చిందంటే?

మన HYD చారిత్రక కట్టడాలకు నిలయం. వందలేళ్ల బంగ్లాలు నేటికీ చెక్కుచెదరకుండా చెమక్కుమంటున్నాయి. 1913లో 7వ నిజాం బాగ్-ఇ-ఆమ్(పబ్లిక్ గార్డెన్)లో ఇండో-పర్షియన్ శైలిలో ఓ అద్భుత భవనం నిర్మించారు. తన 25 ఏళ్ల పాలన పూర్తైన సందర్భంగా 7వ నిజాం ఇక్కడ సిల్వర్ జూబ్లీ వేడుకలు జరిపారు. అప్పటినుంచి ఇది ‘జూబ్లీహాల్’గా ప్రసిద్ధి చెందింది. 27 ఏళ్ల పాటు రాష్ట్ర శాసన మండలి ఈ భవనంలో కొనసాగింది. మీరెప్పుడైనా చూశారా?


