News September 2, 2025
కోళ్లలో కొక్కెర వ్యాధితో ప్రమాదం

కోళ్లలో వైరస్ వల్ల వచ్చే కొక్కెర వ్యాధి ప్రమాదకరమైందని పశు వైద్యులు చెబుతున్నారు. ఇది అన్ని వయసుల కోళ్లకూ సోకుతుంది. దీన్ని రాణిఖేత్ డిసీజ్ అని కూడా అంటారు. ఈ వ్యాధి సోకిన కోళ్లలో 80-90% చనిపోతాయి. వ్యాధి సోకిన కోడి ముక్కు నుంచి కారే ద్రవాల వల్ల, వ్యాధి క్రిములతో కలుషితమైన మేత, నీరు, గాలి ద్వారా ఇతర కోళ్లకూ వ్యాపిస్తుంది. వేగంగా ప్రబలి ఫారమ్/గ్రామంలోని కోళ్లన్నీ మరణించి తీవ్రనష్టం వాటిల్లుతుంది.
Similar News
News September 22, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News September 22, 2025
శుభ సమయం (22-09-2025) సోమవారం

✒ తిథి: శుక్ల పాడ్యమి రా.1.10 వరకు
✒ నక్షత్రం: ఉత్తర ఉ.11.12 వరకు
✒ శుభ సమయములు: ఉ.6.30-7.10 వరకు
సా.7.45-8.10 వరకు ✒ రాహుకాలం: ఉ.7.30-9.00 వరకు
✒ యమగండం: ఉ.10.30-12.00 వరకు
✒ దుర్ముహూర్తం: మ.12.24-1.12 వరకు
మ.2.46-3.34 వరకు
✒ వర్జ్యం: రా.8.14-9.55 వరకు
✒ అమృత ఘడియలు: లేవు
News September 22, 2025
పాక్‌పై టీమ్ ఇండియా విజయం

ఆసియాకప్‌లో పాకిస్థాన్‌తో జరిగిన సూపర్-4 మ్యాచులో భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 172 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత ఓపెనర్లు అభిషేక్ శర్మ(74), గిల్(47) తొలి వికెట్‌కు 105 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పారు. స్వల్ప వ్యవధిలో వికెట్లు కోల్పోయినప్పటికీ తిలక్(30*) నిలబడి జట్టుకు విజయాన్ని అందించారు. ఈ టోర్నీలో పాక్‌పై భారత్‌కిది రెండో విజయం. తర్వాతి మ్యాచ్ బుధవారం బంగ్లాదేశ్‌తో ఆడనుంది.