News October 2, 2024
DANGER: కూల్‌డ్రింక్స్, కాఫీ, రెడీమేడ్ జ్యూస్‌లతో పక్షవాతం!

కూల్ డ్రింక్స్, రెడీమేడ్ జ్యూస్‌లతో పక్షవాతం బారిన పడే ముప్పు ఉందని పరిశోధనలో తేలింది. వీటిలో ఉండే అదనపు చక్కెరలు, ప్రిజర్వేటివ్‌లు పక్షవాతానికి దారి తీస్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు. రెడీమేడ్ ఫ్రూట్ జ్యూస్‌లు, రోజుకి 4 కప్పుల కంటే ఎక్కువ కాఫీ తాగితే పక్షవాతం ముప్పు 37% పెరుగుతుందని తెలిపారు. బ్లాక్ టీ, రోజుకి ఏడు కప్పుల కన్నా ఎక్కువ నీరు తాగడం పక్షవాతం ముప్పును తగ్గిస్తాయని పేర్కొన్నారు.
Similar News
News February 4, 2026
మార్చిలోపు దివ్యాంగ పోస్టుల భర్తీ: మంత్రి

AP: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న దివ్యాంగ బ్యాక్‌లాగ్ పోస్టులను మార్చిలోపు భర్తీ చేయాలని మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి ఆదేశించారు. అదే విధంగా గ్రామ, వార్డు సచివాలయాల పర్యవేక్షణకు జిల్లాకో అధికారిని నియమించాలని సూచించారు. ఉద్యోగులందరికీ పదోన్నతులు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. వెలగపూడి సచివాలయంలో అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.
News February 4, 2026
చిక్కుల్లో ‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’ పుస్తకం

ఆర్మీ మాజీ చీఫ్ నరవణె రాసిన ‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’ పుస్తకం పార్లమెంటులో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటివరకూ పబ్లిష్ కాని ఈ బుక్ కాపీ రాహుల్ గాంధీ చేతిలో కనిపించడంతో వివాదం మరింత ముదిరింది. చైనాతో ఉద్రిక్తతలపై ఇందులో రాశారని రాహుల్ ఆరోపిస్తున్నారు. ప్రచురించని పుస్తకంలో ఉన్న వాటిని లేవనెత్తడం దేశ భద్రతకు ముప్పని కేంద్రం అంటోంది. రక్షణ శాఖ అనుమతులు రాకపోవడంతో 2023 నుంచి ఇది ప్రచురణ కాలేదు.
News February 4, 2026
U19 WC: భారత్ రికార్డు

అండర్-19 మెన్స్ వరల్డ్ కప్‌లో భారత్ డామినేషన్ కొనసాగుతోంది. టీమ్ ఇండియా ఫైనల్ చేరడం U19 WC చరిత్రలో ఇది పదో సారి. దీంతో మొత్తం 16 ఎడిషన్లలో అత్యధిక సార్లు ఫైనల్ చేరిన జట్టుగా రికార్డు నెలకొల్పింది. ఇవాళ SF-2లో AFGపై 311 పరుగులు ఛేదించగా, U19 WC హిస్టరీలో ఇదే హయ్యెస్ట్ సక్సెస్‌ఫుల్ రన్ ఛేజ్. మరోవైపు వరుసగా 6 ఎడిషన్లలో (2016, 18, 20, 22, 24, 26) భారత్ ఫైనల్ చేరడం విశేషం.


