News October 21, 2024

హర్యానా గవర్నర్ దత్తాత్రేయ కాన్వాయ్‌కి ప్రమాదం

image

TG: హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కాన్వాయ్‌కి రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లేందుకు ఆయన శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వెళ్తున్న సమయంలో ఓ కారు కాన్వాయ్ మధ్యలోకి వచ్చింది. దీంతో కాన్వాయ్‌లోని ఓ వాహనం సడన్ బ్రేక్ వేయడంతో కాన్వాయ్‌లోని మూడు వాహనాలు ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో భద్రతా సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News September 16, 2025

వరికి అధికంగా యూరియా వేస్తున్నారా?

image

వరి నాట్లు వేసిన 2-3 వారాల మధ్య.. పైరు చిరుపొట్ట దశలో ఉన్నప్పుడు రెండుసార్లు యూరియా వేయాలి. ప్రతిసారీ ఎకరాకు 35 నుంచి 45 కిలోల యూరియా వేస్తే సరిపోతుంది. చాలామంది రైతులు మాత్రం ఎకరాకు ఒకటిన్నర నుంచి రెండు బస్తాల వరకు యూరియా వేస్తున్నారు. అధిక యూరియా వల్ల అధిక దిగుబడి వస్తుందనే ఉద్దేశంతో రైతులు ఇలా చేస్తున్నారు. దీని వల్ల నష్టమే తప్ప లాభం ఉండదని వ్యవసాయ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

News September 16, 2025

‘ఆరోగ్యశ్రీ’ బంద్.. చర్చలకు అంగీకరించని సర్కార్

image

TG: ఆరోగ్యశ్రీ సేవల బంద్‌కు పిలుపునిచ్చిన ప్రైవేట్ ఆసుపత్రుల సంఘాలతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ‘ఇప్పటికే ₹140 కోట్ల బకాయిల్లో ₹100 కోట్లు విడుదలయ్యాయి. 150 కార్పొరేట్ ఆసుపత్రుల్లో సేవలు కొనసాగుతాయి. ఎమర్జెన్సీ సేవలు అందుతాయి. మిగతా 330 చిన్న, మధ్య తరహా ఆసుపత్రులు ప్రభుత్వాన్ని బెదిరిస్తున్నాయి’ అని హెల్త్ మినిస్టర్ కార్యాలయ అధికారి Way2Newsకు తెలిపారు.

News September 16, 2025

విషాదం.. గుండెపోటుతో డిగ్రీ విద్యార్థిని మృతి

image

AP: వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు మరణాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో డిగ్రీ విద్యార్థిని నాగమణి(18) హార్ట్ ఎటాక్‌తో ప్రాణాలు కోల్పోయింది. నిన్న సాయంత్రం కాలేజీ నుంచి స్నేహితులతో నడుచుకుంటూ ఇంటికి బయల్దేరింది. వారితో మాట్లాడుతుండగానే అకస్మాత్తుగా కుప్పకూలింది. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె చనిపోయిందని వైద్యులు తెలిపారు. మరణానికి గుండెపోటే కారణమని పేర్కొన్నారు.