News November 10, 2024
మోదీ, షా నుంచే దేశానికి ప్రమాదం: ఖర్గే
భారత్కు మోదీ, షా నుంచే ప్రమాదం పొంచి ఉందని AICC చీఫ్ మల్లికార్జున్ ఖర్గే తాజాగా వ్యాఖ్యానించారు. దేశ ప్రజల్ని కాంగ్రెస్ కులాల ప్రాతిపదికన విభజిస్తోందని PM చేసిన విమర్శలపై ఆయన ఝార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో స్పందించారు. ‘దేశాన్ని మతం, కులం పేరిట విభజించేది బీజేపీ వాళ్లే. మేం మనుషుల్ని ఏకం చేస్తాం. అలా ఏకం చేయడం కోసమే ఇందిర ప్రాణత్యాగం చేశారు. భారత్కు ముప్పు ఉందంటే అది బీజేపీ వల్లే’ అని మండిపడ్డారు.
Similar News
News November 13, 2024
RGV కోసం హైదరాబాద్కు ఒంగోలు పోలీసులు
దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు నోటీసులు అందించేందుకు ఒంగోలు పోలీసులు హైదరాబాద్ చేరుకున్నారు. మద్దిపాడు ఎస్ఐ శివరామయ్య టీమ్ ఇవాళ ఆర్జీవీకి సమన్లు అందజేయనున్నట్లు తెలుస్తోంది. కాగా ‘వ్యూహం’ సినిమా ప్రమోషన్లలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్ వ్యక్తిత్వాలు కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ మద్దిపాడు పోలీస్ స్టేషన్లో ఆర్జీవీపై కేసు నమోదైంది.
News November 13, 2024
STOCK MARKETS: ఈ సెక్టార్ తప్ప అన్నీ రెడ్జోన్లోనే..
బెంచ్మార్క్ సూచీలు భారీ నష్టాల్లో మొదలయ్యాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు, FIIలు వెళ్లిపోతుండటం, డాలర్ బలపడటం నెగటివ్ సెంటిమెంటుకు దారితీశాయి. సెన్సెక్స్ 78,384 (-300), నిఫ్టీ 23,765 (-118) వద్ద ట్రేడవుతున్నాయి. Pvt Banks మినహా అన్ని రంగాల షేర్లపై సెల్లింగ్ ప్రెజర్ నెలకొంది. మీడియా, ఆటో, మెటల్ షేర్లు విలవిల్లాడుతున్నాయి. M&M, BEL, TATA STEEL, HEROMOTO, HINDALCO టాప్ లూజర్స్.
News November 13, 2024
క్రికెట్లోకి యశస్వీ జైస్వాల్ సోదరుడు రీఎంట్రీ
టీమ్ ఇండియా క్రికెటర్ యశస్వీ జైస్వాల్ అన్న తేజస్వీ జైస్వాల్ క్రికెట్లోకి రీఎంట్రీ ఇచ్చారు. త్రిపుర తరఫున బరోడాతో జరిగిన మ్యాచ్లో తేజస్వీ (87) అర్ధ సెంచరీ సాధించారు. కాగా తొలుత యశస్వీ, తేజస్వీ ఇద్దరూ క్రికెట్ ఆడేవారు. కానీ యశస్వీ కోసం తేజస్వీ క్రికెట్ వదిలి ఢిల్లీలోని ఓ దుకాణంలో సేల్స్మెన్గా పనిచేశారు. అంతర్జాతీయ క్రికెట్లో యశస్వీ నిలదొక్కుకున్నాక తేజస్వీ మళ్లీ క్రికెట్లోకి రీఎంట్రీ ఇచ్చారు.