News June 25, 2024
DAO పరీక్ష హాల్‌టికెట్లు విడుదల

TG: 53 డివిజనల్ ఎకౌంట్స్ అధికారుల పోస్టుల భర్తీకి నిర్వహించే పరీక్ష హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. అభ్యర్థులు TGPSC ఐడీ, DOB ఎంటర్ చేసిన హాల్‌టికెట్లు పొందవచ్చు. ఈ నెల 30 నుంచి జూలై 4 వరకు మల్టీసెషన్స్, CBRT విధానంలో పరీక్షలు నిర్వహిస్తామని TGPSC తెలిపింది. ఉ.10 నుంచి 12.30 వరకు పేపర్-1, మ.2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2 పరీక్షలు జరుగుతాయంది. హాల్‌టికెట్ల కోసం ఇక్కడ <
Similar News
News November 14, 2025
Leading: ఎన్డీయే డబుల్ సెంచరీ

బిహార్‌లో అద్వితీయ విజయం దిశగా ఎన్డీయే దూసుకుపోతోంది. ప్రస్తుతం 200 స్థానాల్లో ముందంజలో ఉంది. ఎంజీబీ కేవలం 37 స్థానాల్లోపే లీడ్‌లో ఉంది. మరోవైపు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ నిలిచింది. ఆ పార్టీ 91 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. జేడీయూ 81, ఆర్జేడీ 28 సీట్లలో ఆధిక్యంలో ఉన్నాయి.
News November 14, 2025
సంచలనం.. రికార్డు సృష్టించిన నవీన్ యాదవ్

జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ సంచలనం సృష్టించారు. మెజారిటీలో దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, విష్ణు రికార్డును బ్రేక్ చేశారు. ఇదివరకు నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీ రికార్డు 2009లో విష్ణు(కాంగ్రెస్) పేరిట ఉంది. ఆయన 21,741 ఓట్ల మెజార్టీతో గెలిచారు. తాజా ఉపఎన్నికలో నవీన్ యాదవ్ దాదాపు 25వేల ఓట్ల మెజారిటీతో గెలిచి ఆ రికార్డును బ్రేక్ చేశారు.
News November 14, 2025
ట్రీ ఉమెన్ ఆఫ్ కర్ణాటక తిమ్మక్క కన్నుమూత

కర్ణాటకకు చెందిన ప్రముఖ పర్యావరణవేత్త, పద్మశ్రీ అవార్డు గ్రహీత సాలుమరద తిమ్మక్క 114 ఏళ్ల వయసులో అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. 1911లో పేద కుటుంబంలో జన్మించిన తిమ్మక్క ట్రీ ఉమెన్ ఆఫ్ కర్ణాటకగా ప్రసిద్ధి చెందారు. దశాబ్దాలుగా రహదారుల వెంట 8వేలకు పైగా మొక్కలు నాటారు. వ్యవసాయ పనుల్లో కుటుంబానికి సహాయం చేసేందుకు చిన్నతనంలోనే చదువు మానేయాల్సి వచ్చింది. జీవితాంతం నిస్వార్థంగా ప్రకృతికి సేవ చేశారు.


