News October 22, 2024

మరోసారి బెయిల్‌కు దరఖాస్తు చేసుకున్న దర్శన్

image

కన్నడ సినీ నటుడు దర్శన్ మరోమారు బెయిల్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ఆయనకు అనారోగ్యంగా ఉందని ఆయన తరఫు లాయర్లు కోర్టుకు విన్నవించారు. నడుం నొప్పి చాలా తీవ్రంగా ఉందని, సర్జరీ చేస్తే తప్ప కోలుకోలేరని బెయిల్ పిటిషన్లో తెలిపారు. దర్శన్, పవిత్ర గౌడ్ ఇంతకు ముందు దాఖలు చేసిన పిటిషన్ ఈ నెల 14న తిరస్కరణకు గురైన సంగతి తెలిసిందే. తన అభిమాని రేణుకాస్వామి మర్డర్ కేసులో వీరిద్దరూ నిందితులుగా ఉన్నారు.

Similar News

News January 13, 2026

మేడారం మహాజాతర.. ఈ నంబర్ సేవ్ చేసుకోండి

image

TG: మేడారం భక్తుల కోసం ‘MyMedaram’ పేరిట వాట్సాప్‌ సేవలను మంత్రులు సీతక్క, వాకిటి శ్రీహరి ప్రారంభించారు. 7658912300 నంబర్‌కు మెసేజ్‌ చేస్తే రూట్ మ్యాప్‌లు, మరుగుదొడ్లు, వైద్య శిబిరాలు, ట్రాఫిక్ వివరాలు క్షణాల్లో తెలుసుకోవచ్చని తెలిపారు. తప్పిపోయిన వారి సమాచారం, ఫిర్యాదులు వంటి వివరాలు ఇందులో లభిస్తాయి. ఈ సేవలు వెబ్‌సైట్‌, మొబైల్ యాప్‌తో పాటు వాట్సాప్‌లోనూ అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలిపారు.

News January 13, 2026

కిటికీకి ఎదురుగా మరో కిటికీ ఉండవచ్చా?

image

నివాస గృహాలలో ఓ కిటికీకి ఎదురుగా మరో కిటికీ ఉండేలా ప్లాన్ చేసుకుంటే ఆరోగ్యం, ప్రశాంతత సొంతమవుతాయని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు చెబుతున్నారు. ‘ఈ నిర్మాణం గాలి ప్రవాహాన్ని మెరుగుపరచి, గదుల ఉష్ణోగ్రత క్రమబద్ధంగా ఉంచుతుంది. సరైన వెలుతురు ప్రసరిస్తుంది. తద్వారా దైవకళతో ఉట్టిపడుతుంది. ఇది పని పట్ల ఏకాగ్రతను పెంచుతుంది. శ్వాసకోశ సమస్యలను దూరం చేస్తుంది’ అని చెబుతున్నారు. <<-se>>#Vasthu<<>>

News January 13, 2026

చైనా మాంజాపై పోలీసు కమిషనర్‌కు HRC నోటీసులు

image

TG: గాలిపటాలు ఎగురవేసేందుకు వినియోగిస్తున్న చైనా మాంజా కారణంగా పలువురు ప్రమాదాల బారిన పడుతున్నారు. తీవ్రంగా గాయపడి కొన్నిచోట్ల పిల్లల ప్రాణాలూ పోతున్నాయి. దీనిపై దాఖలైన ఫిర్యాదుతో తెలంగాణ మానవ హక్కుల కమిషన్ (TGHRC) సీరియస్‌గా స్పందించింది. HYD పోలీసు కమిషనర్ సజ్జనార్‌కు నోటీసులు జారీచేసింది. ఈ ఘటనలపై నివేదిక సమర్పించాలని ఆదేశించింది. అడ్వకేట్ రామారావు ఇమ్మానేని HRCలో ఈ పిటిషన్ దాఖలు చేశారు.