News June 16, 2024

పవిత్ర గౌడను దర్శన్ పెళ్లి చేసుకోలేదు: దర్శన్ లాయర్

image

అభిమాని హత్య కేసులో అరెస్టయిన కన్నడ హీరో దర్శన్, నటి పవిత్ర గౌడకు పెళ్లి కాలేదని దర్శన్ లాయర్ అనిల్ తెలిపారు. వారిద్దరూ పార్టనర్స్ కాదని, క్లోజ్ ఫ్రెండ్స్ అని పేర్కొన్నారు. ‘దర్శన్ రెండో పెళ్లి చేసుకోలేదు. రేణుకా స్వామి హత్యతో ఆయనకు సంబంధం లేదు. క్రైమ్ జరిగిన చోట ఆయన కారు ఉన్నట్లు CCTV ఫుటేజ్ చూపిస్తోంది. కానీ ఆ కారులో ఆయన లేరు. పోలీసులు ఇంకా ఎలాంటి ఆధారాలు సమర్పించలేదు’ అని మీడియాకు వివరించారు.

Similar News

News October 6, 2024

ఆంధ్రుల హక్కు ముఖ్యమా.. పొత్తు ముఖ్యమా?: షర్మిల

image

AP: సీఎం చంద్రబాబుకు ఆంధ్రుల హక్కులు ముఖ్యమా, లేదంటే బీజేపీతో పొత్తు ముఖ్యమా అని పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ అంశంపై మోదీ, అమిత్ షాను నిలదీయాలని ఆమె డిమాండ్ చేశారు. ‘వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపకపోతే మద్దతు ఉపసంహరించుకుంటామని డిమాండ్ చేయాలి. రాష్ట్ర ప్రయోజనాల కంటే పొత్తు ప్రయోజనాలు అంత ముఖ్యమేమీ కాదు’ అని ఆమె పేర్కొన్నారు.

News October 6, 2024

సీఎం రేవంత్ లేఖలో పొరపాటు.. BRS సెటైర్లు

image

TG: CM రేవంత్ ప్రధాని మోదీకి రాసిన లేఖపై BRS సెటైర్లు వేస్తోంది. అందులో నేటి తేది(06.10.2024)కి బదులుగా (07.10.2024) పేర్కొనడం ఇందుకు కారణం. దీంతో పాటు ఆగస్టు 15 వరకు రూ.17,869.22 కోట్లు రుణమాఫీ చేశామని ఈరోజు సీఎం లేఖలో చెప్పగా ఆగస్టు 15న చేసిన ట్వీట్‌లో మాత్రం రూ.31,000 కోట్లు మాఫీ చేశామని పేర్కొన్నారు. దీంతో ప్రతిపక్ష బీఆర్ఎస్ శ్రేణులు ట్రోల్స్ చేస్తున్నాయి.

News October 6, 2024

బంగ్లాపై భారత్ గ్రాండ్ విక్టరీ

image

బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టీ20లో టీమ్ ఇండియా ఘన విజయం సాధించింది. బ్యాటర్లు, బౌలర్లు సమష్టిగా రాణించడంతో బంగ్లాను 7 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. 128 పరుగుల టార్గెట్‌ను టీమ్ ఇండియా 11.5 ఓవర్లలోనే ఛేదించింది. సూర్య 29, శాంసన్ 29, అభిషేక్ 16, నితీశ్ 16* రన్స్ చేయగా చివర్లో హార్దిక్(16 బంతుల్లో 39*) బంగ్లా బౌలర్లపై విరుచుకుపడ్డారు. 2 సిక్సర్లు, 5 ఫోర్లు బాది జట్టుకు విజయాన్ని అందించారు.