News August 26, 2024

దర్శన్‌కు VIP ట్రీట్‌మెంట్.. అధికారులను సస్పెండ్ చేసిన CM

image

ప‌ర‌ప్పన అగ్ర‌హార జైలులో హ‌త్య కేసులో అరెస్టైన కన్నడ హీరో దర్శన్‌కు <<13939449>>వీఐపీ ట్రీట్‌మెంట్<<>> ఇవ్వడంపై సీఎం సిద్ద రామయ్య సీరియస్ అయ్యారు. దీనికి బాధ్యులైన జైలు సిబ్బందిని వెంటనే సస్పెండ్ చేయాలని అధికారులను ఆదేశించారు. దర్శన్‌తోపాటు మరికొందరిని తక్షణమే వేర్వేరు జైళ్లకు తరలించాలని, జైలును సందర్శించి కేసుపై పూర్తి నివేదిక ఇవ్వాలని రాష్ట్ర డీజీపీని ఆదేశించినట్లు X వేదికగా తెలియజేశారు.

Similar News

News November 20, 2025

సంతానలేమికి ముందే హెచ్చరికలు

image

సంతానలేమితో బాధపడే మహిళల్లో రజస్వల నాటి నుంచే కొన్ని హెచ్చరిక సంకేతాలు కనిపిస్తుంటాయంటున్నారు నిపుణులు. నెలసరి సక్రమంగా రాకపోవడం, ఎక్కువరోజులు బ్లీడింగ్ కావడం, కొందరు 18 ఏళ్లు వచ్చినా అసలు రజస్వలే కాకపోవడం వంటివి గమనించాలి. ఊబకాయం, అవాంఛిత రోమాలు మొలవటం, విడవకుండా మొటిమలు వేధించటం, తీవ్రమైన కడుపునొప్పి వంటివీ ఉండొచ్చు. వీటిని రక్త పరీక్షలు, స్కానింగ్‌తో గుర్తించొచ్చు.

News November 20, 2025

వయసు పెరుగుతున్నా.. తగ్గేదేలే!

image

తెలుగు హీరోలు మహేశ్(50), నాగార్జున(66) సహా పలువురు నటులు వయసు పెరిగే కొద్దీ మరింత యంగ్‌ లుక్‌లో కనిపిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. వారి ముఖాల్లో ఏమాత్రం వృద్ధాప్య ఛాయలు కనిపించకపోవడం ‘వయసు వెనక్కి వెళ్తోందా?’ అనే చర్చకు దారితీస్తోంది. ఈ హీరోలు తమ ఫిట్‌నెస్, లైఫ్‌స్టైల్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం వల్లే ఇలాంటి ‘ఏజింగ్ బ్యాక్‌వర్డ్స్’ లుక్ సాధ్యమవుతోందని ఫిట్నెస్ నిపుణులు చెబుతున్నారు.

News November 20, 2025

గంభీర్‌పై విమర్శలు.. బ్యాటింగ్ కోచ్ ఏమన్నారంటే?

image

SAతో తొలి టెస్టులో టీమ్ ఇండియా ఓడటంతో హెడ్ కోచ్ గంభీర్‌పై <<18307995>>విమర్శలొచ్చిన<<>> సంగతి తెలిసిందే. దీనిపై బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో స్పందించారు. ‘గంభీర్ ఒక్కడినే టార్గెట్ చేస్తూ అందరూ మాట్లాడుతున్నారు. బ్యాటర్లు, బౌలర్లు, సపోర్ట్ స్టాఫ్ గురించి ఎందుకు మాట్లాడట్లేదు. కోల్‌కతా పిచ్‌ను మేం బ్లేమ్ చేయట్లేదు. అది అంత త్వరగా టర్న్ అవుతుందని ఊహించలేదు’ అని పేర్కొన్నారు.