News July 4, 2024

దర్శన్ నా కొడుకు లాంటివాడు: సుమలత

image

రేణుకాస్వామి హత్య కేసులో నటుడు దర్శన్ అరెస్ట్ కావడం షాక్‌కు గురి చేసిందని నటి సుమలత తెలిపారు. ‘అతడు 25ఏళ్ల నుంచి తెలుసు. నాకు కొడుకు లాంటివాడు. ఏ తల్లీ తన కొడుకుని ఇలాంటి స్థితిలో చూడాలనుకోదు. దర్శన్ ఈ నేరానికి పాల్పడ్డాడని అనుకోవడం లేదు’ అని ఓ ప్రకటన విడుదల చేశారు. అదేసమయంలో రేణుకాస్వామి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన సుమలత.. ఆయన కుటుంబానికి న్యాయం జరగాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.

Similar News

News December 1, 2025

ఈ టీకాతో గర్భాశయ క్యాన్సర్‌కు 90% చెక్..!

image

మహిళలకు ప్రాణాంతకమైన గర్భాశయ క్యాన్సర్‌ను నివారించడంలో హ్యూమన్ పాపిల్లోమావైరస్ (HPV) వ్యాక్సిన్ ప్రభావవంతంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. HPV టీకా తీసుకున్న బాలికల్లో, టీకా తీసుకోని వారితో పోలిస్తే, గర్భాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం 80% నుంచి 90% వరకు గణనీయంగా తగ్గినట్లు తాజా డేటా స్పష్టం చేసింది. టీకా తీసుకున్న తర్వాత 15-20 సంవత్సరాల పాటు రక్షణ ప్రభావం ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.

News December 1, 2025

చిన్న వయసులోనే టీకా ఎందుకు తీసుకోవాలంటే..?

image

గర్భాశయ క్యాన్సర్‌కు ప్రధాన కారణమైన హ్యూమన్ పాపిల్లోమావైరస్ (HPV) సంక్రమించడానికి ముందే టీకా తీసుకోవడం వల్ల అత్యధిక రక్షణ లభిస్తుంది. అందుకే, లైంగిక చర్య ప్రారంభానికి ముందే, అంటే 9 నుంచి 12 సంవత్సరాల మధ్య వయస్సులో బాలికలకు టీకా ఇవ్వాలని వైద్య నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. బాలికలకే కాకుండా పురుషాంగం, పాయువు, గొంతు క్యాన్సర్ల రక్షణ కోసం బాలురు కూడా ఈ టీకా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

News December 1, 2025

శివుడు పుర్రెల దండ ఎందుకు ధరిస్తాడు?

image

పరమ శివుడు పుర్రెల దండ, చితాభస్మం ధరించి శ్మశానంలో తిరుగుతుంటాడు. అందుకు కారణం శిష్టరక్షణ. అసురులు ధర్మబద్ధంగా వరాలు పొంది దేవతలను హింసించేవారు. వారిని మోహానికి గురి చేయడానికి విష్ణుమూర్తి ఆజ్ఞ మేరకు శివుడు ఈ వేషం ధరించి, పాషండ మతాన్ని ఉపదేశించాడు. దీంతో వేద నింద, దైవ నింద చేసిన రాక్షసుల తేజస్సు క్షీణించింది. అలాగే వారి నుంచి దేవతలకు ఉపశమనం లభించింది. ఇది ధర్మ రక్షణకై హరిహరులు చేసిన లీల.