News June 28, 2024

దర్శన్ అన్న అలాంటి వ్యక్తి కాదు: నాగశౌర్య

image

అభిమానిని క్రూరంగా హత్య చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న కన్నడ నటుడు దర్శన్‌కు టాలీవుడ్ హీరో నాగశౌర్య మద్దతు తెలిపారు. రేణుకాస్వామి మృతిపై విచారం వ్యక్తం చేస్తూనే.. దర్శన్ కలలో కూడా ఎవరికీ హాని చేసే వ్యక్తి కాదన్నారు. ఈ విషయంలో ప్రజలు తొందరపాటుతో ఆయనను దోషిగా నిర్ధారిస్తుంటే బాధేస్తోందన్నారు. తనకు న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉందని, త్వరలోనే నిజం బయటికి వస్తుందని ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు.

Similar News

News December 3, 2025

PCOSతో దంత సమస్యలు

image

పీసీఓఎస్‌ సమస్య పెరిగినప్పుడు ‘పెరియోడాన్‌టైటిస్‌’ అనే చిగుళ్ల సమస్య కూడా వస్తుందంటున్నారు నిపుణులు. దీన్ని నిర్లక్ష్యం చేస్తే దంతాలు వదులవుతాయంటున్నారు. PCOS వల్ల మహిళల్లో ఈస్ట్రోజెన్‌, ప్రొజెస్టిరాన్‌ అసమతుల్యత ఏర్పడుతుంది. దీంతో చిగుళ్లలో రోగనిరోధక శక్తి తగ్గి ఇన్ఫెక్షన్లు వస్తాయి. కాబట్టి వైద్యులను సంప్రదిస్తే తగిన మందులతో పాటు ఆహారపుటలవాట్లలో కూడా మార్పులు-చేర్పులు సూచిస్తారని చెబుతున్నారు.

News December 3, 2025

నేపియర్ కంటే 4G బుల్లెట్ సూపర్ నేపియర్ ఎందుకు ప్రత్యేకం?

image

నేపియర్ గడ్డి ముదిరితే కాండం కాస్త గట్టిగా ఉంటుంది. 4G బుల్లెట్ సూపర్ నేపియర్ కాండం ముదిరినా లోపల డొల్లగా ఉండి, పాడి పశువు తినడానికి సులువుగా ఉంటుంది. నేపియర్‌తో పోలిస్తే దీనిలో తీపిదనం కాస్త ఎక్కువగా ఉంటుంది. ఈ గడ్డి చాలా గుబురుగా పెరుగుతుంది. 4G బుల్లెట్ సూపర్ నేపియర్‌లో ప్రొటీన్ కంటెంట్, దిగుబడి, మొక్కలు పెరిగే ఎత్తు, మొక్క ఆకుల్లోని మృదుత్వం.. సాధారణ నేపియర్ గడ్డి కంటే ఎక్కువగా ఉంటుంది.

News December 3, 2025

సత్యనారాయణ వ్రతం ఎప్పుడు చేయాలి?

image

సత్యనారాయణ వ్రతాన్ని ఆచరించడానికి ఏకాదశి, పౌర్ణమి తిథులు అత్యంత శుభప్రదమైనవిగా పండితులు సూచిస్తారు. కొత్తగా ఉద్యోగం, వ్యాపారం ప్రారంభించే ముందు ఈ వ్రతం చేస్తే మంచి జరుగుతుందని నమ్ముతారు. ఇంట్లో సుఖశాంతులు, సానుకూల శక్తి కోసం, గృహ దోషాలు తొలగిపోవడానికి ఈ వ్రతం చేస్తారు. పుట్టినరోజు, పెళ్లిరోజు వంటి శుభ దినాలలో చేస్తే విశేష ఫలితాలుంటాయని నమ్మకం. ఈ వ్రతం గురించి మరింత సమాచారం కోసం <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>.