News November 26, 2024
జనవరిలో వైకుంఠ ద్వారా దర్శనం.. ఆ సేవలు రద్దు
AP: వైకుంఠ ఏకాదశికి తిరుమలలో ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వారా దర్శనం కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ఆ సమయంలో వీఐపీ బ్రేక్ దర్శనాలు, ఆర్జిత సేవలతో పాటు చిన్నారులు, వృద్ధులు, దివ్యాంగులు, ఆర్మీ, ఎన్ఆర్ఐ దర్శనాలు రద్దు చేయాలని నిర్ణయించారు. వీఐపీ ప్రొటోకాల్ దర్శనాలకు మాత్రం అనుమతివ్వనున్నారు.
Similar News
News November 26, 2024
మూడేళ్లలో తెలుగు రాష్ట్రాలకు కేంద్ర నిధులివే
వివిధ పద్దుల కింద FY22-24 మధ్య మూడేళ్లలో ఏపీకి రూ.1.48 లక్షల కోట్ల నిధులు ఇచ్చినట్లు కేంద్రం పార్లమెంట్లో వెల్లడించింది. తెలంగాణకు రూ.1.22 లక్షల కోట్లు మంజూరు చేసినట్లు తెలిపింది. అలాగే నవభారత సాక్షరత కార్యక్రమం(ఉల్లాస్) కింద ఏపీలో 30.70 లక్షల మంది నమోదైతే తెలంగాణలో ఆ సంఖ్య 75 మాత్రమేనని కేంద్ర మంత్రి జయంత్ చౌధరి చెప్పారు.
News November 26, 2024
నేటి నుంచి భారీ వర్షాలు
AP: బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని IMD తెలిపింది. దీని ప్రభావంతో ఇవాళ, రేపు నెల్లూరు, సత్యసాయి, YSR, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. నెల్లూరు, తిరుపతి, ప్రకాశంలో 3 రోజులు వానలుంటాయని పేర్కొంది. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని చెప్పింది. మత్స్యకారులు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
News November 26, 2024
గుడ్ల ఉత్పత్తిలో ఏపీ వెరీ గుడ్
AP: FY23లో గుడ్లు, ఆయిల్పామ్ ఉత్పత్తిలో రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. మాంసం ఉత్పత్తిలో నాలుగు, పాల ఉత్పత్తిలో ఐదో స్థానంలో నిలిచినట్లు తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన 2023-24 ఆర్థిక సర్వేలో వెల్లడైంది. ఆ కాలంలో 2,78,498 లక్షల గుడ్లు, 10.94 లక్షల టన్నుల మాంసం, 154 లక్షల టన్నుల పాల దిగుబడి సాధించినట్లు తేలింది. 18.95 లక్షల మెట్రిక్ టన్నుల క్రూడ్ పామ్ ఆయిల్ ఉత్పత్తి అయినట్లు పేర్కొంది.