News October 11, 2024

మహిషాసురమర్దనిగా దుర్గమ్మ దర్శనం

image

AP: రాష్ట్రవ్యాప్తంగా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. విజయవాడ కనకదుర్గమ్మ ఇవాళ మహిషాసురమర్దనిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. అష్టభుజాలతో సింహ వాహనంపై కొలువుదీరారు. ఈ అలంకారంలో అమ్మవారిని దర్శించుకోవడం వల్ల సర్వదోషాలు తొలగిపోతాయని, ధైర్య, స్థైర్య, విజయాలు చేకూరుతాయని భక్తుల నమ్మకం.

Similar News

News December 6, 2025

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2047 షెడ్యూల్

image

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న గ్లోబల్ సమ్మిట్-2047 ఎల్లుండి ప్రారంభం కానుంది. హైదరాబాద్ శివారులోని ఫ్యూచర్ సిటీలో విశాలమైన ప్రాంగణంలో ఈ సదస్సు జరగనుంది. వివిధ దేశాలకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వ నేతలు, దేశంలోని కేంద్రమంత్రులు, పలు రాష్ట్రాల సీఎంలు, మంత్రులు హాజరవనున్నారు. సమ్మిట్ రెండు రోజుల షెడ్యూల్‌ను ఇక్కడ <>క్లిక్ <<>>చేసి చూడొచ్చు.

News December 6, 2025

సెల్యూట్ డాక్టర్.. 1.2లక్షల మందికి ఉచితంగా..!

image

నిస్సహాయులకు వైద్యం అందని చోట డాక్టర్ సునీల్ కుమార్ హెబ్బీ ఆశాదీపంగా మారారు. పేరు కోసం కాకుండా సేవ చేయడానికి తన కారును ‘సంచార క్లినిక్‌’గా మార్చుకున్నారు. బెంగళూరు వీధుల్లోని పేదలకు ఇంటి వద్దే ఉచితంగా చికిత్స అందిస్తున్నారు. ఒక రోడ్డు ప్రమాదంతో మొదలైన ఈ గొప్ప ప్రయాణం ఇప్పటికే 1.2 లక్షల మందికిపైగా ప్రాణాలను కాపాడింది. వైద్య పరికరాలతో నిండిన ఆయన కారు ఎంతో మందికి కొత్త జీవితాన్నిస్తోంది.

News December 6, 2025

గ్లోబల్ సమ్మిట్‌కు ప్రత్యేక విమానాలు: భట్టి

image

TG: ఈ నెల 8, 9న ఫ్యూచర్ సిటీలో జరగనున్న గ్లోబల్ సమ్మిట్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈ సదస్సుకు వచ్చే ప్రముఖుల కోసం ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేయనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. కాగా ఇండిగో విమానాల రద్దు నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. దీంతో సమ్మిట్‌కు వచ్చే వారు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.