News July 21, 2024
జూకంటికి ‘దాశరథి’ పురస్కారం

TG: ప్రతిష్ఠాత్మక ‘దాశరథి కృష్ణమాచార్య అవార్డు’కు ప్రముఖ కవి జూకంటి జగన్నాథంను రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. కమిటీ నిర్ణయం మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనకు అవార్డుతో పాటు రూ.1,01,116 నగదు, జ్ఞాపికను అందజేయనుంది. సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లికి చెందిన జూకంటికి 30 ఏళ్లకుపైగా కవిగా, రచయితగా అనుభవం ఉంది. ఆయన మొదటి కవితా సంకలనం పాతాళ గరిగె. 1998లో తొలిసారి సినారె కవితా పురస్కారం అందుకున్నారు.
Similar News
News November 20, 2025
తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్రపతి ముర్ము పర్యటన

ఏపీ, తెలంగాణలో పలు కార్యక్రమాల్లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పాల్గొననున్నారు. 22న పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో జరగనున్న సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలకు ఆమె హాజరవుతారని రాష్ట్రపతి కార్యాలయం ప్రకటించింది. తొలుత 21న హైదరాబాద్లో ‘భారతీయ కళామహోత్సవ్- 2025’ను రాష్ట్రపతి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించనున్నారు. అనంతరం శనివారం పుట్టపర్తికి వెళ్లనున్నారు.
News November 20, 2025
చెరకు పంటను ఇలా నరికితే ఎక్కువ లాభం

చెరకు పంటను నరికేటప్పుడు గడలను భూమట్టానికే నరకాలి. కొన్ని ప్రాంతాల్లో భూమి పైన రెండు, మూడు అంగుళాలు వదిలేసి నరుకుతుంటారు. ఇలా చేయడం వల్ల రైతుకు నష్టం. మొదలు కణపులలో పంచదార పాలు ఎక్కువగా ఉండడం వల్ల ఇటు పంచదార అటు బెల్లం దిగుబడులు కూడా తగ్గుతాయి. చెరకును భూమట్టానికి నరికి ఖాళీ చేసిన తోటల్లో వేళ్లు లోతుగా చొచ్చుకెళ్లి తోట బలంగా పెరిగి వర్షాకాలంలో వచ్చే ఈదురు గాలులు, వర్షాలను కూడా తట్టుకుంటుంది.
News November 20, 2025
Op Sindoor: రఫేల్ జెట్లపై చైనా తప్పుడు ప్రచారం!

‘ఆపరేషన్ సిందూర్’ విషయంలో చైనా తప్పుడు ప్రచారం చేసిందని అమెరికా సంచలన ఆరోపణలు చేసింది. ‘ఫేక్ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా నకిలీ ఫొటోలను చైనా వ్యాప్తి చేసింది. రఫేల్ యుద్ధ విమానాలను తమ క్షిపణులతో కూల్చేసినట్లుగా ప్రచారం చేసుకుంది’ అని US-చైనా ఎకనమిక్, సెక్యూరిటీ రివ్యూ కమిషన్
తెలిపింది. రఫేల్ జెట్లపై నమ్మకాన్ని దెబ్బతీసి, తమ J-35 విమానాలకు డిమాండ్ పెంచుకోవాలని చైనా కుట్ర పన్నినట్లు ఆరోపించింది.


