News March 9, 2025

BRS ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్

image

TG: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్ పేరును కేసీఆర్ ప్రకటించారు. BRS తరఫున రేపు శ్రవణ్ నామినేషన్ వేయనున్నారు. అటు కాంగ్రెస్ విజయశాంతి, శంకర్ నాయక్, అద్దంకి దయాకర్ పేర్లను ప్రకటించింది.

Similar News

News December 7, 2025

భారీ జీతంతో రైట్స్‌లో ఉద్యోగాలు..

image

<>RITES <<>>17 ఇండివిడ్యువల్ కన్సల్టెంట్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. సివిల్ ఇంజినీరింగ్, డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి నెలకు జీతం రూ.60,000-రూ.2,55,000 వరకు చెల్లిస్తారు. అభ్యర్థుల గరిష్ట వయసు 62ఏళ్లు. డిసెంబర్ 10, 11 తేదీల్లో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. https://www.rites.com

News December 7, 2025

ఇవాళ 1,500 సర్వీసులు నడుపుతాం: ఇండిగో

image

ఇండిగో విమానాల సంక్షోభం ఆరో రోజూ కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా పలు ఎయిర్‌పోర్టుల్లో పదుల సంఖ్యలో సర్వీసులు క్యాన్సిల్ అయ్యాయి. ఒక్క హైదరాబాద్‌లోనే 100 దాకా రద్దు చేసినట్లు తెలుస్తోంది. దీంతో ప్రయాణికులకు పడిగాపులు తప్పడం లేదు. అయితే ఆదివారం కావడంతో రద్దీ కాస్త తగ్గినట్లు సమాచారం. మరోవైపు 95 శాతం కనెక్టివిటీని పునరుద్ధరించామని ఇండిగో చెబుతోంది. ఇవాళ 1,500 సర్వీసులు నడుపుతామని తెలిపింది.

News December 7, 2025

రబీ నువ్వుల సాగుకు అనువైన రకాలు

image

☛ ఎలమంచిలి 11(TNN వరాహ): పంట కాలం 80-85 రోజులు. నూనె 52%గా ఉంటుంది. దిగుబడి ఎకరాకు 300-350 కిలోలు. ఇది ముదురు గోధుమ రంగు విత్తనం. కోస్తా, రాయలసీమ జిల్లాలకు ఈ రకం అనుకూలం.
☛ ఎలమంచిలి 17: పంటకాలం 75-80 రోజులు. దిగుబడి ఎకరాకు 340-400 కిలోలు. గింజల్లో నూనె 52.5%గా ఉంటుంది. ఇది లేత గోధుమ రంగు విత్తనం. కోస్తా, రాయలసీమ జిల్లాలకు అనుకూలం. ఆకుమచ్చ తెగులను కొంత వరకు తట్టుకుంటుంది.