News March 11, 2025

KCRను కలిసిన దాసోజు శ్రవణ్

image

TG: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి దాసోజు శ్రవణ్ మాజీ సీఎం కేసీఆర్‌ను కలిశారు. తనకు MLCగా అవకాశం ఇచ్చినందుకు కుటుంబ సమేతంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్నారు. అటు దాసోజుకు కేసీఆర్ అభినందనలు తెలిపారు.

Similar News

News December 8, 2025

ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

∆} పలు శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష
∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్ తిరిగి ప్రారంభం
∆} పెనుబల్లి నీలాద్రీశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
∆} ఖమ్మంలో ఎమ్మెల్సీ తాత మధుసూదన్ పర్యటన
∆} నేలకొండపల్లిలో అభ్యర్థులకు అవగాహన కార్యక్రమం
∆} వైరాలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన
∆}ఖమ్మం ప్రజావాణి కార్యక్రమం రద్దు
∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి పర్యటన

News December 8, 2025

హోటళ్లలో ఇకపై ఆధార్ కాపీ అవసరం లేదు!

image

వెరిఫికేషన్ పేరుతో హోటళ్లు, ఈవెంట్ల నిర్వాహకులు కస్టమర్ల ఆధార్ కాపీలను తీసుకోకుండా UIDAI కొత్త రూల్ తీసుకురానుంది. QR కోడ్ స్కానింగ్ లేదా ఆధార్ యాప్ ద్వారా వెరిఫై చేసేలా మార్పులు చేయనుంది. ఆధార్ వెరిఫికేషన్ కోరే హోటళ్ల రిజిస్ట్రేషన్లను తప్పనిసరి చేసింది. యూజర్ల ప్రైవసీకి, డేటాకు రక్షణ కల్పించేందుకు UIDAI ఈ దిశగా అడుగులేస్తోంది. దీంతో ఓయో, ఇతర హోటళ్లలో గదులు బుక్ చేసుకునే వారికి ఉపశమనం కలగనుంది.

News December 8, 2025

డెయిరీఫామ్‌తో నెలకు రూ.1.25 లక్షల ఆదాయం

image

స్త్రీలు కూడా డెయిరీఫామ్ రంగంలో రాణిస్తారని నిరూపిస్తున్నారు హిమాచల్‌ప్రదేశ్‌లోని తుంగల్ లోయకు చెందిన సకీనా ఠాకూర్. పీజీ పూర్తి చేసిన ఈ యువతి కుటుంబం వద్దన్నా ఈ రంగంలో అడుగుపెట్టారు. తన ఫామ్‌లో ఉన్న 14 హెచ్‌ఎఫ్ ఆవుల నుంచి రోజూ 112 లీటర్ల పాలను విక్రయిస్తూ.. నెలకు రూ.1.25 లక్షలకు పైగా ఆదాయం పొందుతున్నారు. సకీనా సక్సెస్ వెనుక కారణాలను తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట <<>>క్లిక్ చేయండి.