News October 11, 2025

డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు

image

AP: విజయనగరంలోని జనరల్ హాస్పిటల్‌ కాంట్రాక్ట్ ప్రాతిపదికన 10 డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులను భర్తీ చేయనుంది. డిగ్రీ, PGDCA అర్హతగల అభ్యర్థులు ఈ నెల 13న ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. డిగ్రీ, పీజీడీసీఏలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. నెలకు రూ.12వేలు గౌరవ వేతనం చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://vizianagaram.ap.gov.in/

Similar News

News October 11, 2025

బాలికలకు భరోసానిద్దాం..

image

ప్రపంచవ్యాప్తంగా బాలికలు ఇప్పటికీ వివక్ష, హింస వంటి అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారు. బాలికలకు కూడా సమాన హక్కులుండాలనే ఉద్దేశంతో అక్టోబర్ 11ని అంతర్జాతీయ బాలికా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఈ ఏడాది బాలికల నాయకత్వం, వారి స్వతంత్ర గుర్తింపు అనేది థీమ్‌. లింగ వివక్ష ఎక్కువగా ఇంటినుంచే మొదలవుతుంది. వారికి సమాన అవకాశాలు కల్పిస్తే సమాజాభివృద్ధికి మార్గం సుగమం అవుతుందంటున్నారు నిపుణులు.

News October 11, 2025

రాముడిపై భక్తితో 1,338KM నడిచిన భక్తుడు

image

రాముడిపై అనంతమైన భక్తితో గుజరాత్‌కి చెందిన 73 ఏళ్ల వృద్ధుడు లాల్ హర్జీవన్ దాస్ పటేల్ 1,338 కిలోమీటర్లు నడిచారు. భవ్య రామమందిర దర్శనం సంకల్పంగా ఆగస్టు 30న పాదయాత్ర ప్రారంభించి ప్రతిరోజు 35KM నడిచారు. మొత్తం 1,338KMను 40 రోజుల్లో పూర్తి చేసి, అయోధ్య చేరుకున్నారు. చిన్ననాటి కోరిక నెరవేరడం, రాముడిని దర్శించుకోవడం తన జన్మ ధన్యమైందని తెలిపారు. గతంలో 1990లో అద్వానీ రథయాత్రలోనూ ఆయన పాల్గొన్నారు.

News October 11, 2025

15న క్యాబినెట్ భేటీ.. బీసీ రిజర్వేషన్లపై చర్చ

image

TG: ఈ నెల 15న క్యాబినెట్ సమావేశం కానుంది. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై తెచ్చిన జీవోపై హైకోర్టు స్టే విధించడంపై చర్చించనుంది. అలాగే గతంలో మాదిరిగా రిజర్వేషన్ల పరిమితి 50%కి మించకుండా ఎన్నికలకు వెళ్లొచ్చన్న ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వులపై మంత్రులు సమాలోచనలు జరపనున్నారు.