News November 1, 2024
డేటా ధరలు మన దగ్గరే తక్కువ!

దేశంలో ఇంటర్నెట్ వినియోగం భారీగా పెరిగిపోయింది. ప్రజలకు అందుబాటు ధరలకే ఇంటర్నెట్ లభిస్తుండం దీనికి ప్రధాన కారణం. ఒకప్పుడు 1GB డేటా కోసం రూ.254 చెల్లించాల్సి వచ్చేది. అది ఇప్పుడు రూ.8కే వస్తోంది. అయితే ప్రపంచవ్యాప్తంగా స్విట్జర్లాండ్లో ఇంటర్నెట్ ధరలు అధికంగా ఉన్నాయి. అక్కడ 1GB ధర $7.29 (రూ.612). ఆ తర్వాత యునైటెడ్ స్టేట్స్ ($6.00), న్యూజిలాండ్ ($5.89), కెనడా ($5.37), దక్షిణ కొరియా ($5.01) ఉన్నాయి.
Similar News
News November 12, 2025
5 విమానాశ్రయాలకు బాంబు బెదిరింపు

ఢిల్లీ పేలుడు ఘటన తర్వాత దేశంలోని 5 విమానాశ్రయాలకు తాజాగా బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. HYD, ఢిల్లీ, ముంబై, చెన్నై, త్రివేండ్రం ఎయిర్పోర్టులు పేల్చేస్తామని దుండగుల నుంచి ఇండిగో ఎయిర్లైన్స్ కార్యాలయానికి మెయిల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన బాంబ్ స్క్వాడ్ HYD సహా మిగతా ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టింది. బస్టాప్స్, టెంపుల్స్, షాపింగ్ మాల్స్లోనూ సోదాలు నిర్వహిస్తోంది.
News November 12, 2025
ఇతిహాసాలు క్విజ్ – 64 సమాధానాలు

ఈరోజు ప్రశ్న: కర్ణుడు బ్రాహ్మణుడు కాదు, క్షత్రియుడు అని పరశురాముడు ఎలా గుర్తించాడు?
జవాబు: ఓరోజు పరశురాముడు కర్ణుడి ఒడిలో తలపెట్టి నిద్రిస్తున్నాడు. ఆ సమయంలో ఓ పురుగు కర్ణుడి తొడను రక్తం వచ్చేలా కుట్టింది. గురువు నిద్రకు భంగం కలగకూడదని కర్ణుడు ఆ నొప్పిని భరించాడు. రక్తపు ధార తగిలి పరశురాముడు మేల్కొని, ఆ దారుణమైన బాధను సహించే శక్తి క్షత్రియుడికి తప్ప వేరొకరికి ఉండదని గుర్తించాడు. <<-se>>#Ithihasaluquiz<<>>
News November 12, 2025
15-20 రోజుల్లో కాళేశ్వరం బ్యారేజీల్లో టెస్టులు: ఉత్తమ్

TG: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. మేడిగడ్డ కూలిపోవడానికి, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల్లో లీకేజీలకు తప్పుడు నిర్ణయాలు, సాంకేతిక లోపాలే ప్రధాన కారణమని NDSA పేర్కొందని చెప్పారు. 15-20 రోజుల్లో నీటి నిల్వలు తగ్గిన వెంటనే జియో ఫిజికల్, హైడ్రాలిక్ టెస్టులు నిర్వహిస్తామని వెల్లడించారు.


