News January 1, 2025

గాయనితో బీజేపీ ఎంపీ పెళ్లికి ముహూర్తం ఖరారు

image

అత్యంత పిన్నవయస్కుడైన ఎంపీలలో ఒకరైన బీజేపీ నేత తేజస్వీ సూర్య త్వరలో పెళ్లి చేసుకోనున్నారు. ఈ ఏడాది మార్చి 24న చెన్నైకు చెందిన గాయని శివశ్రీ స్కంద ప్రసాద్‌, తాను వివాహబంధంతో ఒక్కటవనున్నట్లు ఆయన ప్రకటించారు. తేజస్వి బెంగళూరు దక్షిణ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఉండగా, శివశ్రీ గాయనిగా, భరతనాట్య కళాకారిణిగా రాణిస్తున్నారు.

Similar News

News January 4, 2025

నేడు గోవా, కొచ్చిలో ఫ్రెంచి నేవీ విన్యాసాలు

image

నేడు భారత నేవీతో కలిసి ఫ్రెంచి నేవీ గోవా, కొచ్చి తీరాల్లో విన్యాసాలు చేపట్టనుంది. ఈ సంయుక్త విన్యాసాల ద్వారా ఇరు దేశాల మధ్య బంధం బలోపేతం చేసుకోవడంతో పాటు ఇండో-పసిఫిక్ భద్రతకు తాము కట్టుబడి ఉన్నామన్న విషయాన్ని భారత్, ఫ్రాన్స్ గుర్తుచేయనున్నాయని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. అణు యుద్ధ విమాన వాహక నౌక, ఫ్రిగేట్స్, అణు సబ్‌మెరైన్ సహా ఫ్రెంచి నేవీలోని కీలక రక్షణ ఈ విన్యాసాల్లో పాలుపంచుకోనున్నాయి.

News January 4, 2025

రోహిత్ సెలక్టర్ల ఫ్యూచర్ ప్లాన్‌లో లేడేమో: గవాస్కర్

image

భారత సెలక్టర్ల ఫ్యూచర్ ప్లాన్‌లో టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ లేడేమోనని క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అన్నారు. రానున్న రోజుల్లో జట్టులో భారీ మార్పులు జరుగుతాయని ఆయన జోస్యం చెప్పారు. ‘ప్రస్తుతం శర్మ వయసు 37. వచ్చే WTC ఫైనల్ నాటికి 41కి చేరుకుంటారు. ఆ వయసులో ఆయన టెస్టులు ఆడడం అనుమానమే. అందుకే ఆయన స్థానంలో యంగ్ లీడర్‌షిప్‌ను బీసీసీఐ తయారు చేస్తుందేమో’ అని ఆయన అభిప్రాయపడ్డారు.

News January 4, 2025

ఇజ్రాయెల్‌పైకి గాజా రాకెట్ల దాడి

image

తమపై వైమానిక దాడులు చేసిన ఇజ్రాయెల్‌పైకి గాజా యంత్రాంగం రాకెట్లతో ప్రతిదాడి చేసింది. తమ భూభాగం లక్ష్యంగా గాజా వైపునుంచి 3 రాకెట్ల దూసుకొచ్చాయని ఇజ్రాయెల్ ఓ ప్రకటనలో తెలిపింది. ఇది కొనసాగితే తమ దాడుల తీవ్రతను మరింత పెంచుతామని హెచ్చరించింది. మరోవైపు ఇజ్రాయెల్ తాజా దాడులు 16మంది పాలస్తీనా పౌరుల్ని బలితీసుకున్నాయని గాజా యంత్రాంగం వెల్లడించింది.