News July 15, 2024

గ్రూప్స్ పరీక్షల తేదీలను మార్చాలి: తమ్మినేని

image

TG: పరీక్షలు వాయిదా వేయాలని నిరసన చేస్తున్న నిరుద్యోగులను అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రకటనలో పేర్కొన్నారు. డీఎస్సీ ముగిసిన రెండు రోజులకే గ్రూప్స్ పరీక్షలు ఉన్నాయన్నారు. ఎక్కువ శాతం DSC అభ్యర్థులే రాయనున్నారని ఎగ్జామ్ వాయిదా వేయడంలో ప్రభుత్వం మాత్రం మొండిగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. గ్రూప్స్ పరీక్షల తేదీలను మార్చాలని ఆయన కోరారు.

Similar News

News November 23, 2025

ఇంధన పొదుపుపై షార్ట్ వీడియో పోటీలు

image

AP: ఇంధన సామర్థ్యం/పొదుపుపై షార్ట్ వీడియో పోటీలు నిర్వహిస్తున్నట్లు జెన్‌కో MD నాగలక్ష్మి వెల్లడించారు. 8, 9, 10 తరగతుల విద్యార్థులు పోటీకి అర్హులని తెలిపారు. ‘తెలుగు, ఇంగ్లిష్, హిందీ భాషల్లో 30-120సెకన్ల నిడివితో MP4 ఫార్మాట్‌లో వీడియోలు రూపొందించి DEC 10లోగా పంపాలి. తొలి 3 స్థానాల్లో నిలిచిన వారికి ₹20K, ₹10K, ₹5K బహుమతులు ఇస్తాం. వివరాలకు 0866-2457620 నంబరులో సంప్రదించాలి’ అని చెప్పారు.

News November 23, 2025

సర్పంచి ఎన్నికలు.. UPDATE

image

TG: గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు వార్డుల వారీగా రిజర్వేషన్లు ఖరారు చేసింది. ఈ రిజర్వేషన్ల జాబితాను జిల్లాల కలెక్టర్లకు పంపిస్తోంది. సాయంత్రం కల్లా ఈ ప్రక్రియ పూర్తికానున్నట్లు తెలుస్తోంది. జనాభా నిష్పత్తిని బట్టి SC, ఎస్టీ, బీసీ స్థానాలను కేటాయించినట్లు సమాచారం. కాగా బీసీలకు 22%తో కలుపుకొని మొత్తం రిజర్వేషన్లు 50% మించకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు.

News November 23, 2025

ఈ రిలేషన్‌షిప్ ట్రెండ్స్ గురించి తెలుసా?

image

జెన్​ జి కిడ్స్ ప్రతి వ్యక్తితోనూ వారికున్న రిలేషన్​కి విచిత్రమైన పేర్లు పెట్టేసి ట్రెండ్ చేస్తున్నారు. వాటిల్లో కొన్నిటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
* ఎవాల్యూషన్‌షిప్‌-ఈ రిలేషన్‌లో ఉన్నవారు మొదట్లో మామూలుగానే ఉంటారు. పోనుపోనూ వారి అనుబంధం బలపడుతుంది. ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ముందుకెళ్తారు.* బెంచింగ్‌షిప్‌- ఈ రిలేషన్‌షిప్‌లో ఒకరితో ఒకరు పూర్తిగా సంబంధాన్ని పెంచుకోరు, అలాగని తెంచుకోరు.