News October 10, 2024

దటీజ్ రతన్ టాటా.. అవమానానికి ప్రతీకారం

image

1998లో టాటా తయారుచేసిన తొలి హాచ్‌బ్యాక్ కారు ఇండికా సక్సెస్ కాలేదు. దీంతో ఫోర్డ్ కంపెనీకి విక్రయించాలనుకున్నారు. చర్చల సమయంలో ఫోర్డ్ యజమాని బిల్ ఫోర్డ్ రతన్ టాటాను అవమానించేలా మాట్లాడారు. దీంతో రతన్‌కు పౌరుషం వచ్చి ఆ డీల్‌ను ఆపేశారు. తన ప్రతిభతో మార్కెట్‌లో అదే కారును అగ్రస్థానంలోకి తీసుకొచ్చారు. చివరికి ఫోర్డ్‌కే చెందిన జాగ్వార్, లాండ్ రోవర్లను కూడా టాటా కొనుగోలు చేసింది. దటీజ్ రతన్ టాటా.

Similar News

News November 2, 2025

నదుల పక్కన ఇంటి నిర్మాణాలు చేయవచ్చా?

image

వాగులు, నదుల పక్కన ఇల్లు కట్టుకోవద్దని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచించారు. జల ప్రవాహాలు ఎక్కువైతే.. ఆస్తి, ప్రాణ నష్టం కలిగే ప్రమాదం ఉందన్నారు. ‘నీటి ఒత్తిడి వల్ల పునాదుల బలం తగ్గి, ఇంట్లో స్థిరత్వం లోపిస్తుంది. ప్రకృతి శక్తుల వైపరీత్యం నుంచి ఇల్లు సురక్షితంగా ఉండాలంటే, వరుణ దేవుని ఆగ్రహానికి గురికావొద్దంటే ఈ స్థలాలను నివారించాలి. భద్రత కోసం వీటికి దూరంగా ఉండటం ఉత్తమం’ అని చెప్పారు. <<-se>>#Vasthu<<>>

News November 2, 2025

అవి నిరాధార ఆరోపణలు: ప్రశాంత్ వర్మ

image

తనపై ఓ నిర్మాణ సంస్థ ఫిర్యాదు చేసినట్లు వస్తున్న వార్తలను డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఖండించారు. అవన్నీ నిరాధారమైన, తప్పుడు ఆరోపణలని స్పష్టం చేశారు. ‘నాకు, ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్‌కు మధ్య ఉన్న వివాదం తెలుగు ఫిల్మ్ ఛాంబర్, ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ వద్ద పరిశీలనలో ఉంది. దీనిపై వారు విచారణ జరిపి నిర్ణయం తీసుకుంటారు. అప్పటిదాకా వివాదాలు సృష్టించవద్దు’ అని ఓ ప్రకటనలో కోరారు.

News November 2, 2025

‘కాశీబుగ్గ’ తొక్కిసలాట అప్డేట్స్

image

* మృతుల కుటుంబాలకు కేంద్ర మంత్రి రామ్మోహన్, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు రూ.15 లక్షల చొప్పున పరిహారం అందజేశారు.
* కేంద్రం ప్రకటించిన రూ.2లక్షల ఎక్స్‌గ్రేషియా కూడా త్వరలో అందుతుందని రామ్మోహన్ చెప్పారు.
* పలాస ఆస్పత్రి నుంచి 15 మంది బాధితులు డిశ్చార్జ్ అయ్యారు. మరో 11 మందికి సీహెచ్‌సీతో చికిత్స కొనసాగుతోంది. మెరుగైన వైద్యం కోసం ఒకరిని శ్రీకాకుళం ఆస్పత్రికి తరలించాం: మంత్రి సత్యకుమార్ యాదవ్