News January 13, 2025

49 ఏళ్ల నటితో డేటింగ్ వార్తలు.. సింగర్ స్పందన ఇదే

image

ప్రముఖ నటి అమీషా పటేల్(49) పలు బ్రేకప్‌ల తర్వాత ఇప్పటికీ ఒంటరిగానే ఉంటున్నారు. ఆమె ఇటీవల తనకంటే 20 ఏళ్ల చిన్నవాడైన సింగర్ నిర్వాన్ బిర్లాతో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. వారిద్దరూ దుబాయ్‌లో క్లోజ్‌గా ఉన్న ఫొటోలు వైరలయ్యాయి. ఆ రూమర్లను తాజాగా నిర్వాన్ ఖండించారు. ‘అమీషా మా ఫ్యామిలీ ఫ్రెండ్. చిన్నప్పటి నుంచి మా నాన్నకు ఆమె తెలుసు. మ్యూజిక్ ఆల్బమ్ కోసం మేం దుబాయ్ వెళ్లాం’ అని పేర్కొన్నారు.

Similar News

News January 31, 2026

బిల్ గేట్స్‌కు సెక్సువల్ డిసీజ్.. ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో సంచలనం

image

బిల్ గేట్స్ గురించి <<19008385>>ఎప్‌స్టీన్ ఫైల్స్<<>> తాజాగా షాకింగ్ విషయాన్ని వెల్లడించాయి. రష్యన్ యువతులతో గడిపిన తర్వాత ఆయనకు సెక్సువల్ డిసీజ్ సోకిందని ఎప్‌స్టీన్ రాసుకున్న మెయిల్స్ ద్వారా తెలుస్తోంది. ఆ విషయాన్ని దాచిపెట్టి భార్య మెలిందాకు యాంటీబయాటిక్స్ ఇవ్వాలని యత్నించారని పేర్కొన్నాయి. ఈ ఆరోపణలను బిల్ గేట్స్ ఖండించారు. తనను బ్లాక్ మెయిల్ చేయడానికే ఎప్‌స్టీన్ ఇలాంటి అబద్ధపు ప్రచారాలు చేశాడని చెప్పారు.

News January 31, 2026

OTTలోకి ‘MSVPG’.. అప్పుడేనా?

image

చిరంజీవి-అనిల్ రావిపూడి కాంబోలో వచ్చి సూపర్ హిట్ అయిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్లు సినీవర్గాలు చెబుతున్నాయి. OTT హక్కులను జీ5 దక్కించుకోగా FEB 11 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు పేర్కొంటున్నాయి. JAN 12న రిలీజైన మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.360కోట్ల గ్రాస్ వసూలు చేసిన విషయం తెలిసిందే. అటు సంక్రాంతికి వచ్చిన <<19000195>>రాజాసాబ్<<>>, <<19002366>>నారీనారీ నడుమ మురారీ<<>> 0TT స్ట్రీమింగ్ డేట్లు ఫిక్స్ అయ్యాయి.

News January 31, 2026

ఇరాన్ వైపు భారీ యుద్ధ నౌకల కాన్వాయ్.. ట్రంప్ డెడ్‌లైన్ వార్నింగ్!

image

అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత ముదురుతున్నట్లు కనిపిస్తోంది. తాజాగా ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘మేం ఇరాన్ వైపు భారీ యుద్ధ నౌకల సమూహాన్ని పంపుతున్నాం. వారితో డీల్ కుదుర్చుకోవాలని ఆశిస్తున్నాం. వారు ఒప్పుకోకపోతే ఏం జరుగుతుందో చూద్దాం’ అని హెచ్చరించారు. న్యూక్లియర్ డీల్ కోసం తాను ఇప్పటికే ఒక డెడ్‌లైన్ విధించినట్లు చెప్పారు. అది ఎప్పటి వరకు అనేది మాత్రం బయటకు వెల్లడించలేదు.