News January 2, 2025
₹550 CRతో కూతురి పెళ్లి! బికారిగా మారిన తండ్రి!

కర్మ! అన్ని సరదాలూ తీర్చేస్తుందనడానికి ఇదే ఉదాహరణ. అపర కుబేరుల్లో ఒకరైన లక్ష్మీమిత్తల్ బ్రదరే ప్రమోద్. 2013లో కుమార్తె సృష్టి పెళ్లికి రూ.550CR ఖర్చు చేసిన ఆయన ఇప్పుడు దివాలా తీసి బికారిగా మారి జైలుకెళ్లారు. ఆయన గ్యారంటర్గా ఉన్న GIKIL కంపెనీ $116mln రుణం తీర్చకపోవడంతో పతనం మొదలైంది. మోసం కేసులో 2019లో బోస్నియాలో అరెస్టయ్యారు. దివాలా తీసి భార్య, బిడ్డల నుంచి నెలవారీ ఖర్చుల కోసం దేహీ అంటున్నారు.
Similar News
News October 31, 2025
PCOS ఉందా? ఇలా చేయండి

పీసీఓఎస్ ఉన్న వారిలో అధిక బరువు, ఇర్రెగ్యులర్ పిరియడ్స్.. వంటివి సంతానలేమికి కారణమవుతాయి. అయితే ఈ సమస్యల్ని తగ్గించుకొని పీసీఓఎస్ను అదుపు చేసుకోవాలంటే తీసుకునే ఆహారంలో తక్కువ కార్బోహైడ్రేట్లు ఉండేలా జాగ్రత్తపడాలంటున్నారు నిపుణులు. తద్వారా శరీరంలో ఇన్సులిన్ స్థాయులు అదుపులో ఉంటాయి. నెలసరి కూడా క్రమంగా వస్తుంది. PCOS కంట్రోల్ అయ్యి గర్భం దాల్చడం సులువవుతుంది.
News October 31, 2025
కార్తీకంలో వ్రతస్థులు పాటించాల్సిన నియమాలు

కార్తీక మాసంలో వ్రతం పాటించేవారు మాంసం, తేనె, రేగుపండ్లు, నల్ల ఆవాలు తినకూడదు. ఇతరుల ఇంట్లో భోజనం చేయకూడదు. దేశ సంచారం మానుకోవాలి. బ్రహ్మను, గురువులను, రాజులను, స్త్రీలను, గోవుల సేవ చేసేవారిని నిందించరాదు. ఆవు, గేదె, మేక పాలు తప్ప వేరే జంతువుల పాలను తీసుకోరాదు. దీక్షా సమయంలో బ్రహ్మచర్యం పాటించాలి. భోజనాన్ని ఆకులలోనే తినాలి. నరక చతుర్దశి రోజు తప్ప మిగతా రోజులలో తైలాభ్యంగనం చేయకూడదు. <<-se>>#Karthikam<<>>
News October 31, 2025
టాస్ ఓడిన టీమ్ ఇండియా

మెల్బోర్న్ వేదికగా INDతో జరుగుతున్న రెండో టీ20లో టాస్ గెలిచిన ఆసీస్ బౌలింగ్ ఎంచుకుంది.
భారత్ ప్లేయింగ్ XI: అభిషేక్ శర్మ, గిల్, సూర్యకుమార్(C), తిలక్ వర్మ, శాంసన్, దూబే, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, కుల్దీప్, వరుణ్ చక్రవర్తి, బుమ్రా
ఆస్ట్రేలియా ప్లేయింగ్ XI: మిచెల్ మార్ష్(C), హెడ్, ఇంగ్లిస్, టిమ్ డేవిడ్, మాథ్యూ షార్ట్, ఓవెన్, స్టోయినిస్, బార్ట్లెట్, నాథన్ ఎల్లిస్, మాథ్యూ కుహ్నెమాన్, హేజిల్వుడ్


