News January 2, 2025
₹550 CRతో కూతురి పెళ్లి! బికారిగా మారిన తండ్రి!
కర్మ! అన్ని సరదాలూ తీర్చేస్తుందనడానికి ఇదే ఉదాహరణ. అపర కుబేరుల్లో ఒకరైన లక్ష్మీమిత్తల్ బ్రదరే ప్రమోద్. 2013లో కుమార్తె సృష్టి పెళ్లికి రూ.550CR ఖర్చు చేసిన ఆయన ఇప్పుడు దివాలా తీసి బికారిగా మారి జైలుకెళ్లారు. ఆయన గ్యారంటర్‌గా ఉన్న GIKIL కంపెనీ $116mln రుణం తీర్చకపోవడంతో పతనం మొదలైంది. మోసం కేసులో 2019లో బోస్నియాలో అరెస్టయ్యారు. దివాలా తీసి భార్య, బిడ్డల నుంచి నెలవారీ ఖర్చుల కోసం దేహీ అంటున్నారు.
Similar News
News January 5, 2025
భారత్ ఆలౌట్.. ఆసీస్ టార్గెట్ ఎంతంటే?
ఆస్ట్రేలియాతో ఐదో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 157 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్ స్కోర్ 141/6తో టీమ్ ఇండియా మూడో రోజు ప్రారంభించగా వరుసగా జడేజా(13), సుందర్(12), సిరాజ్(4), బుమ్రా(0) వికెట్లు కోల్పోయింది. ఆసీస్ బౌలర్ బోలాండ్ 6 వికెట్లతో చెలరేగారు. కమిన్స్ 3 వికెట్లు తీశారు. AUS గెలవాలంటే 162 రన్స్ కావాలి.
News January 5, 2025
పింక్ జెర్సీలో టీమ్ ఇండియా
క్యాన్సర్ పేషెంట్లకు సంఘీభావంగా సిడ్నీ టెస్టులో భారత ఆటగాళ్లు పింక్ కలర్ డ్రెస్‌లో బరిలోకి దిగారు. ఈ మ్యాచ్ తొలిరోజు నుంచే ఆసీస్ ఆటగాళ్లు పింక్ జెర్సీ ధరించి ఆడుతున్నారు. అయితే నిన్నటివరకు బ్లూకలర్ జెర్సీతో ఆడిన భారత ఆటగాళ్లు ఇవాళ పింక్ జెర్సీ ధరించారు. ప్రేక్షకులు కూడా దాదాపు అందరూ ఆ కలర్ దుస్తులే ధరించి రావడంతో స్టేడియమంతా పింక్‌మయమైంది. అటు మూడోరోజు కాసేపటికే జడేజా, సుందర్ ఔట్ అయ్యారు.
News January 5, 2025
పడిపోతున్న టెంపరేచర్.. వణికిస్తున్న చలి
తెలంగాణలో చలి వణికిస్తోంది. 15 జిల్లాల్లో 10 డిగ్రీలలోపే టెంపరేచర్ నమోదవుతోంది. నిన్న అత్యల్పంగా సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో 6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గడిచిన తొమ్మిదేళ్లలో ఇక్కడ ఇదే కనిష్ఠ ఉష్ణోగ్రత కావడం గమనార్హం. ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్‌లో 6.1, ఆదిలాబాద్ జిల్లా అర్లిలో 6.2, కామారెడ్డి జిల్లా డోంగ్లి, రంగారెడ్డి జిల్లా రెడ్డిపల్లిలో 6.8 చొప్పున టెంపరేచర్ నమోదైంది.