News September 20, 2024
‘పుష్ప 2’లో డేవిడ్ వార్నర్?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న ‘పుష్ప 2’ మూవీపై ఓ క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన స్టిల్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వార్నర్ కేమియోతో ఈ చిత్రంపై అంచనాలు మరింత పెరిగాయి. కాగా బన్నీ సినిమాలకు సంబంధించిన రీల్స్ చేసి వార్నర్ తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు.
Similar News
News February 11, 2026
స్పీకర్‌పై ‘అవిశ్వాసం’.. ఇప్పుడేం జరుగుతుంది?

లోక్‌సభ స్పీకర్‌పై అవిశ్వాస <<19101605>>తీర్మానానికి<<>> ప్రతిపక్షాలు నోటీసులివ్వడం తెలిసిందే. ముందుగా తీర్మానంలో వాడిన భాషను డిప్యూటీ స్పీకర్/ప్యానల్ ఛైర్ పర్సన్ పరిశీలిస్తారు. 14 రోజుల తర్వాత సభ పరిశీలనకు తీర్మానం వస్తుంది. ఈ సమయంలో సభకు స్పీకర్ నేతృత్వం వహించరు. తనపై మోపిన అభియోగాలపై మాట్లాడేందుకు, తన చర్యలను సమర్థించుకునేందుకు స్పీకర్‌కు అవకాశం ఉంటుంది. 10 రోజుల్లోగా లోక్‌సభలో చర్చించి తేల్చాల్సి ఉంటుంది.
News February 11, 2026
మొదలైన పోలింగ్

TG: రాష్ట్రంలో 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలలో పోలింగ్ మొదలైంది. సా.5 గంటల వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. మొత్తం 8,191 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా 52 లక్షల మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇప్పటికే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు.
News February 11, 2026
ఇవాళ వారికి వేతనంతో కూడిన సెలవు

TG: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కార్మిక శాఖ వేతనంతో కూడిన సెలవు ప్రకటించింది. పోలింగ్ జరిగే ప్రాంతాల్లోని ఫ్యాక్టరీలు, షాపులు, ప్రైవేట్ సంస్థల ఉద్యోగులకు ఇది వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆఫీసులు, స్థానిక సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు ఇప్పటికే సెలవు ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఉద్యోగులకు ‘స్పెషల్ క్యాజువల్ లీవ్’ సైతం మంజూరు చేసింది.


