News August 31, 2025
డేవిడ్ వార్నర్ న్యూ లుక్

ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ న్యూ లుక్‌తో ఫ్యాన్స్‌ని సర్‌ప్రైజ్ చేశారు. షార్ట్ హెయిర్‌తో ఉండే వార్నర్ ఇలా లాంగ్ హెయిర్‌తో దర్శనమిచ్చారు. ‘కొత్త హెయిర్ స్టైల్ అద్భుతంగా వస్తోంది’ అంటూ ఓ ఫొటోని ఇన్‌స్టా స్టోరీగా పెట్టారు. పొడవైన జుట్టుతో కనిపించగానే.. వార్నర్ మళ్లీ ఏదైనా మూవీలో నటిస్తున్నారేమో అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆయన నితిన్ ‘రాబిన్ హుడ్’ మూవీలో నటించిన విషయం తెలిసిందే.
Similar News
News February 8, 2026
వేములవాడ: ‘కాంగ్రెస్ పార్టీకి ఓటుతో బుద్ధి చెప్పాలి’

ఎన్నికల హామీలు నెరవేర్చని కాంగ్రెస్ పార్టీకి ఓటుతో బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గం ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు అన్నారు. వేములవాడ మున్సిపల్ 11, 14వ వార్డుల అభ్యర్థులకు మద్దతుగా ఆదివారం ఆయన ప్రచారం నిర్వహించారు. ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిందని, రెండేళ్లు గడిచినా హామీలు అమలు చేయడం లేదని అన్నారు.
News February 8, 2026
ఆపరేషన్ సిందూర్ దెబ్బ.. ఇంకా కోలుకోని పాక్!

గతేడాది పాక్‌లోని ఉగ్ర శిబిరాలు, వైమానిక స్థావరాలపై ‘<<16454711>>ఆపరేషన్ సిందూర్<<>>’తో భారత్ విరుచుకుపడటం తెలిసిందే. 10 నెలలవుతున్నా పాక్ కోలుకున్నట్లు లేదు. అక్కడి భోలారీ హాంగర్‌ను ఇంకా రిపేర్ చేసుకోలేదు. ఇందుకు సంబంధించిన శాటిలైట్ ఫొటోలను NDTV బయటపెట్టింది. ధ్వంసమైన రూఫ్‌ను తొలగించినట్లు తెలిపింది. మురిద్‌లో టార్పాలిన్ కప్పి పనులు చేస్తున్నారని, సుక్కుర్, నూర్ ఖాన్ బేస్‌లోనూ రిపేర్లు చేస్తున్నట్లు చెప్పింది.
News February 8, 2026
వాలంటైన్స్ డే.. భారీగా హోటల్ రూమ్ బుకింగ్స్

‘వాలంటైన్స్ డే’ అంటే ఒకప్పుడు పార్కులు, రెస్టారెంట్లలో సందడి నెలకొనేది. ఇప్పుడు ప్రేమజంటలు హోటల్ స్టేలకు మొగ్గు చూపుతున్నాయి. ఈ feb14కు గతేడాదితో పోలిస్తే హోటల్ బుకింగ్స్ 175% పెరిగాయని ట్రావెల్ సంస్థలు అంటున్నాయి. గువాహటి, కొలంబో, ఆగ్రా, జైపూర్, గోవా, మనాలి తదితర ప్రాంతాలకు డిమాండ్ అధికమని వెల్లడించింది. స్టేతో పాటు ప్రైవేట్ పార్టీలు, లంచ్-డిన్నర్ తదితర ఎక్స్‌పీరియన్స్ ప్రిఫర్ చేస్తున్నారట.


