News November 25, 2024
IPL మెగా వేలం రెండో రోజు ప్రారంభం
సౌదీలోని జెడ్డాలో IPL మెగా వేలం రెండో రోజు ప్రారంభమైంది. తొలి రోజు వేలంలో 72మంది ప్లేయర్లను ఫ్రాంచైజీలు సొంతం చేసుకున్నాయి. వారిలో 24 మంది ఓవర్సీస్ ప్లేయర్లు ఉన్నారు. ఆటగాళ్ల కోసం జట్ల యాజమాన్యాలు ₹467.95 కోట్లు ఖర్చు చేయగా, పంత్‌ను LSG రూ.27కోట్ల భారీ ధరకు సొంతం చేసుకుంది. jiocinema, StarSportsలో ఆక్షన్ లైవ్ చూడొచ్చు.
Similar News
News November 25, 2024
IPL: భారత పేసర్లకు భారీ డిమాండ్
IPL 2025 మెగా వేలంలో రెండో రోజు కూడా టీమ్ ఇండియా పేసర్లకు భారీ డిమాండ్ కొనసాగుతోంది. వీరిని కొనేందుకు అన్ని ఫ్రాంచైజీలు ఎగబడుతున్నాయి. భువనేశ్వర్-రూ.10.75 కోట్లు, దీపక్ చాహర్-రూ.9.25 కోట్లు, ఆకాశ్ దీప్-రూ.8 కోట్లు, ముకేశ్ కుమార్-రూ.8 కోట్లు, తుషార్ దేశ్‌పాండే-రూ.6.50 కోట్లు పలికారు. స్వదేశీ పిచ్‌లపై వీరు మెరుగ్గా రాణిస్తారని ఫ్రాంచైజీలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
News November 25, 2024
విశాఖ రైల్వేజోన్ డిజైన్ ఫొటోలు
AP: విశాఖ రైల్వే జోన్ కార్యాలయం ఏర్పాటుకు టెండర్లను ఆహ్వానించగా, భవనాల డిజైన్‌ను మంత్రి లోకేశ్ Xలో పోస్ట్ చేశారు. 2సెల్లార్ల పార్కింగ్తో కలిపి మొత్తం 11 అంతస్తులు నిర్మించనున్నారు. ఏరియల్ వ్యూ, ఫ్రంట్ వ్యూ, స్ట్రీట్ వ్యూల ఫొటోలు ఆకట్టుకుంటున్నాయి. ఎన్నో ఏళ్ల విశాఖ రైల్వేజోన్ కల త్వరలోనే సాకారం కాబోతోందంటూ మంత్రి లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు.
News November 25, 2024
ALERT: రేపు, ఎల్లుండి ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
దక్షిణ బంగాళాఖాతం, తూర్పు హిందూ మహాసముద్రంలో కేంద్రీకృతమైన వాయుగుండం 30కి.మీ వేగంతో కదులుతోందని APSDMA తెలిపింది. రానున్న 24 గంటల్లో ఇది తీవ్ర వాయుగుండంగా బలపడనున్నట్లు పేర్కొంది. దీని ప్రభావంతో రేపు, ఎల్లుండి నెల్లూరు, సత్యసాయి, YSR, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించింది.