News January 4, 2025

DAY 2 STUMPS: భారత్ స్కోర్ 141/6

image

BGT ఐదో టెస్టులో రెండో రోజు ఆట ముగిసింది. స్టంప్స్ సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో టీమ్ ఇండియా 141/6 స్కోర్ చేసింది. జడేజా (8), సుందర్ (6) నాటౌట్‌గా నిలిచారు. ప్రస్తుతం భారత్ 145 రన్స్ ఆధిక్యంలో ఉంది. భారత బ్యాటర్లలో పంత్ 61, జైస్వాల్ 22, రాహుల్ 13, గిల్ 13, కోహ్లీ 6, నితీశ్ 4 పరుగులు చేసి ఔటయ్యారు. AUS బౌలర్లలో బొలాండ్ 4 వికెట్లతో రాణించారు.

Similar News

News January 6, 2025

ఆందోళన వద్దు.. మీరోజు కోసం వేచి ఉండండి!

image

ఇద్దరూ ఒకేసారి ప్రారంభించినప్పటికీ నీ స్నేహితుడు ముద్దాడిన విజయం మీ దరిచేరలేదని ఆందోళన పడుతున్నారా? ఓసారి పైనున్న ఈ ఫొటో చూడండి. రెండు జామకాయలు ఒకేసారి పక్కపక్కనే పెరిగినా, ఒకటి మాత్రం పండుగా మారింది. అచ్చం ఇలానే విజయం కోసం మీ సమయం వచ్చేవరకూ వేచి ఉండాలి. నిరాశతో మీరు ఫెయిల్ అయ్యారని అనుకోకుండా మీరోజు కోసం వేచి ఉండండి. విజయంలో ఉన్న స్వీట్‌నెస్‌ను రుచిచూడండి.

News January 6, 2025

అల్లు అర్జున్‌కు మరోసారి నోటీసులు

image

TG: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు రాంగోపాల్‌పేట్ <<15069986>>పోలీసులు మరోసారి<<>> నోటీసులు జారీ చేశారు. కిమ్స్ ఆసుపత్రికి శ్రీతేజ్‌ను పరామర్శించేందుకు వెళ్లే ముందు తమకు సమాచారం ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఆయన వెళ్తే గంటలోగా పర్యటన పూర్తి చేసుకోవాలన్నారు. దీనిని రహస్యంగా ఉంచాలని, ఎస్కార్ట్ భద్రత కల్పిస్తామన్నారు.

News January 6, 2025

కేంద్రం సహకరిస్తే ట్రిలియన్ ఎకానమీ సాధిస్తాం: CM

image

TG: మెట్రో రైలు విస్తరణకు, ఆర్ఆర్ఆర్ నిర్మాణానికి సహకరించాలని ప్రధాని మోదీని సీఎం రేవంత్ కోరారు. చర్లపల్లి టర్మినల్ ప్రారంభోత్సవంలో వర్చువల్‌గా పాల్గొని ప్రసంగించారు. కేంద్రం సహకరిస్తే తెలంగాణ రాష్ట్రం ట్రిలియన్ ఎకానమీ సాధిస్తుందని అన్నారు. చర్లపల్లి టర్మినల్ ప్రారంభించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రానికి డ్రై పోర్ట్ ఇవ్వాలని కోరారు.