News December 27, 2024

DAY 2: 5 వికెట్లు కోల్పోయిన టీమ్ ఇండియా

image

ఆస్ట్రేలియాతో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు తొలి ఇన్నింగ్సులో 5 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. క్రీజులో కుదురుకున్నట్లు కనిపించిన జైస్వాల్(82), కోహ్లీ(36) వెంటవెంటనే ఔటయ్యారు. ప్రస్తుతం పంత్(6*), జడేజా(4*) క్రీజులో ఉన్నారు. కమిన్స్, బోలాండ్ చెరో రెండు వికెట్లు తీశారు. అంతకుముందు AUS 474 పరుగులు చేసింది. భారత్ ఇంకా 310 రన్స్ వెనుకబడి ఉంది.

Similar News

News December 28, 2024

విద్యుత్ ఛార్జీల పెంపుపై సీపీఎం పోరుబాట

image

AP: కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచడంపై రాష్ట్రవ్యాప్తంగా నిన్న YCP ఆందోళనలు చేపట్టగా సీపీఎం కూడా పోరు బాటపట్టేందుకు సిద్ధమవుతోంది. వచ్చే నెల 7, 10 తేదీల్లో విజయవాడ, కర్నూలులో ధర్నాలు, భోగి మంటల్లో ఛార్జీల పెంపు జీవోలను దహనం చేస్తామని ప్రకటించింది. మరోవైపు ఫిబ్రవరి 1-4 తేదీల్లో నెల్లూరు జిల్లాలో సీపీఎం రాష్ట్ర మహాసభలను నిర్వహిస్తామని నేతలు తెలిపారు.

News December 28, 2024

నేడు స్కూళ్లకు సెలవు ఉందా?

image

మాజీ PM మన్మోహన్ సింగ్ మృతికి సంతాపంగా కేంద్రం ఇవాళ హాఫ్ డే సెలవు ఇచ్చింది. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు ఈ సెలవు వర్తిస్తుందని తెలిపింది. విద్యాసంస్థలు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ హాలిడే వర్తించదు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో స్కూళ్లు, కాలేజీలు, ఆఫీసులు ఇవాళ యధావిధిగా పనిచేయనున్నాయి. కాగా, నిన్న తెలంగాణలో ఉద్యోగులు, విద్యార్థులకు సెలవు ప్రకటించారు.

News December 28, 2024

వాచ్‌మెన్‌కు జాక్‌పాట్.. లాటరీలో రూ.2.32కోట్లు

image

దుబాయ్‌లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న HYDకు చెందిన రాజమల్లయ్య(60)కు జాక్‌పాట్ తగిలింది. ఇటీవల ప్రకటించిన బిగ్ టికెట్ మిలియనీర్ ఎలక్ట్రానిక్ లక్కీ డ్రాలో ఆయన మిలియన్ దిర్హామ్స్(రూ.2.32 కోట్లు) గెలుచుకున్నారు. దీంతో మల్లయ్య సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. తాను 30ఏళ్లుగా లాటరీ టికెట్ కొంటున్నానని, ఇప్పుడు అదృష్టం వరించిందని తెలిపారు. ఈ మొత్తాన్ని కుటుంబం, స్నేహితులతో పంచుకుంటానని తెలిపారు.