News October 18, 2024

DAY 3: 125 రన్స్ వెనుకంజలో భారత్

image

న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ ఎదురొడ్డుతోంది. మూడోరోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 231/3 రన్స్ చేసింది. మరో 125 రన్స్ వెనుకబడి ఉంది. కోహ్లీ 70, సర్ఫరాజ్ ఖాన్ 70*, రోహిత్ 52, జైస్వాల్ 35 పరుగులు చేశారు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 46 రన్స్‌కే ఆలౌట్ కాగా కివీస్ 402 పరుగులు చేసింది.

Similar News

News December 3, 2025

మార్క్రమ్ సెంచరీ.. ఔట్ చేసిన హర్షిత్‌

image

భారత్ నిర్దేశించిన 359 పరుగుల భారీ లక్ష్యం వైపు సాగుతున్న సౌతాఫ్రికాను హర్షిత్ రాణా దెబ్బ కొట్టారు. తొలి వన్డే ఆదిలోనే వికెట్లు తీసిన అతడు తాజాగా సెంచరీతో చెలరేగిన మార్క్రమ్‌ను వెనక్కి పంపారు. 110 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అతడిని పెవిలియన్ చేర్చారు. అంతకుముందు బవుమా 46, డీకాక్ 8 రన్స్ చేసి ఔట్ అయ్యారు. RSA 30 ఓవర్లలో 197/3 చేసింది. అర్ష్‌దీప్, ప్రసిద్ధ్, హర్షిత్ తలో వికెట్ తీశారు.

News December 3, 2025

ఏపీ న్యూస్ రౌండప్

image

⋆ రేపు తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో ఉ.11 గంటలకు YS జగన్‌ ప్రెస్ మీట్‌
⋆ శ్రీశైలంలో ఈ నెల 7 వరకు సాధారణ భక్తులకు స్పర్శ దర్శనం రద్దు.. ఇరుముడి కలిగిన శివస్వాములకు మాత్రమే ఉచిత స్పర్శ దర్శనం
⋆ వైఎస్ వివేకా హత్య కేసులో సమగ్ర దర్యాప్తు జరపాలని సునీత వేసిన పిటిషన్‌పై తీర్పు రిజర్వ్ చేసిన CBI కోర్టు.. ఈ నెల 10న తీర్పు
⋆ ఈ నెల 23న ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం ఎన్నికలు

News December 3, 2025

ఆ విమానం ఎక్కడ..? మళ్లీ వెతుకులాట!

image

దశాబ్దం కింద కనిపించకుండా పోయిన విమానం కోసం మళ్లీ వెతుకులాట మొదలవనుంది. 2014 MAR 8న 239 మందితో కౌలాలంపూర్ నుంచి బీజింగ్ బయల్దేరిన MH-370 విమానం అదృశ్యమైంది. ఇది ఏవియేషన్ చరిత్రలోనే అతిపెద్ద మిస్టరీగా మారింది. ఈ విమానం హిందూ మహాసముద్రంలో కూలిందన్న అనుమానంతో 50 విమానాలు, 60 ఓడలతో గాలించినా దొరకలేదు. MARలో సెర్చ్ ఆపరేషన్ ముగించగా, ఈ నెల 30న మళ్లీ గాలింపు మొదలుపెడతామని మలేషియా తాజాగా ప్రకటించింది.