News April 2, 2024
అరాచకపాలనకు రోజులు దగ్గరపడ్డాయి: సత్యకుమార్ యాదవ్

AP: బీజేపీ జాతీయ కార్యదర్శి వై.సత్యకుమార్ యాదవ్ టీడీపీ అధినేత చంద్రబాబును కలిశారు. వచ్చే ఎన్నికల్లో ధర్మవరం నుంచి పోటీ చేస్తున్న ఆయన రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై బాబుతో చర్చించినట్లు తెలిపారు. ‘ఏపీలో వైసీపీ అరాచకపాలనకు రోజులు దగ్గరపడ్డాయి. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో బాబు నాయకత్వంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పాటు కానుంది. అంధకారం తొలగి వెలుగులు ప్రసరించనున్నాయి’ అని సత్యకుమార్ ట్వీట్ చేశారు.
Similar News
News December 25, 2025
జామలో కాయకుళ్లు తెగులు – నివారణ

జామ తోటల్లో పక్వానికి వచ్చిన పండ్లపై ఈ తెగులు ప్రభావం కనిపిస్తుంది. కాయకుళ్లు సోకిన జామ పండ్లపై గుండ్రటి గోధుమ రంగు మచ్చలు గుంటలు పడి కనిపిస్తాయి. గోధుమ మచ్చలపై గులాబీ రంగు మచ్చలు కూడా కనిపిస్తాయి. మచ్చలు ఏర్పడిన 3 నుంచి 4 రోజుల్లో పండు కుళ్లిపోతుంది. దీని నివారణకు కాయలు ఏర్పడే సమయంలో కాపర్ ఆక్సీక్లోరైడ్ లీటర్ నీటికి 4గ్రాముల చొప్పున 15 రోజుల వ్యవధిలో 2 నుంచి 3 సార్లు పిచికారీ చేసుకోవాలి.
News December 25, 2025
సోషల్ మీడియా వాడేందుకు సైనికులకు అనుమతి?

భారత సైన్యం సోషల్ మీడియా నిబంధనలను సడలించినట్లు తెలుస్తోంది. ఇన్స్టాగ్రామ్, X వంటి యాప్లను వాడేందుకు సైనికులు, అధికారులకు అనుమతి ఇచ్చినట్లు డిఫెన్స్ వర్గాలు తెలిపాయి. అయితే సమాచారం తెలుసుకోవడం, కంటెంట్ చూడటానికి మాత్రమే అనుమతి ఉంటుంది. పోస్ట్, లైక్, కామెంట్ చేయడానికి పర్మిషన్ లేదని సమాచారం. హనీ ట్రాప్స్ వంటి ముప్పు నేపథ్యంలో భద్రతా నియమాలు పాటిస్తూనే ఈ సౌకర్యాన్ని కల్పించినట్లు తెలుస్తోంది.
News December 25, 2025
స్వయంకృషి: MILK.. మిడిల్ క్లాస్ సిల్క్!

ప్రతి ఇంటికీ పొద్దున్నే కావాల్సిన పాలు ఇప్పుడు కల్తీ లేదా ప్యాకెట్ మయంగా మారాయి. ప్రజలు వీటితో నష్టం గ్రహించి తిరిగి లోకల్ సెల్లర్స్, మిల్క్ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. రైతులకు టైమ్కు, తగిన ధర చెల్లిస్తే నాణ్యమైన పాలు పొందడం కష్టమేం కాదు. నమ్మకం, నాణ్యత మెయింటైన్ చేస్తే రోజూ పట్టణాలు, నగరాల్లో ₹వేల ఆదాయం. మిగిలితే అనే భయం లేకుండా పెరుగు, నెయ్యి లాంటి ఆప్షన్స్ ఉంటాయి.
-డైలీ 1pmకు ఓ బిజినెస్ ఐడియా


