News November 24, 2024
రెండు రాష్ట్రాల్లో DBTలు పనిచేశాయి
MH, ఝార్ఖండ్ ఎన్నికల్లో అధికార పార్టీలు గెలవడం వెనుక DBT పథకాలు పనిచేసినట్టు స్పష్టమవుతోంది. MHలో లడ్కీ బెహెన్, ఝార్ఖండ్లో CM మయ్యా సమ్మాన్ యోజన పథకాల ద్వారా మహిళలకు నెలవారీ ఆర్థిక సాయం ఫలితాలపై ప్రభావం చూపింది. పైగా ప్రస్తుతం ఇస్తున్న ₹1,500ను ₹2,100కు పెంచుతామని మహాయుతి ప్రకటించింది. అలాగే ₹1000 సాయాన్ని ₹2,500కు పెంచుతామని హేమంత్ సోరెన్ హామీ ఇవ్వడం కలిసొచ్చింది.
Similar News
News November 24, 2024
విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ
పెర్త్లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమ్ ఇండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ (52) హాఫ్ సెంచరీ చేశారు. 3 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో ఆయన ఫిఫ్టీ పూర్తి చేసుకున్నారు. కాగా 13 ఇన్నింగ్స్ల తర్వాత విరాట్ అర్ధ సెంచరీ చేయడం విశేషం. ప్రస్తుతం భారత్ స్కోర్ 384/5గా ఉంది. క్రీజులో కోహ్లీతోపాటు వాషింగ్టన్ సుందర్ (18*) ఉన్నారు.
News November 24, 2024
నేనూ NCC క్యాడెట్నే: PM మోదీ
తాను కూడా NCC క్యాడెట్ అని ప్రధాని మోదీ తెలిపారు. ఆదివారం NCC దినోత్సవం సందర్భంగా ఈ అంశాన్ని ఆయన మన్ కీ బాత్లో ప్రస్తావించారు. ‘ఈరోజు చాలా ప్రత్యేకమైనది. నేడు NCC దినోత్సవం. ఈ పేరు వినగానే మనకు స్కూల్, కాలేజీ రోజులు గుర్తుకొస్తాయి. నేనూ NCC క్యాడెట్నే. NCCలో అనుభవం నాకు అమూల్యమైనదని పూర్తి విశ్వాసంతో చెప్పగలను. NCC యువతలో క్రమశిక్షణ, నాయకత్వం, సేవా భావాన్ని పెంపొందిస్తుంద’ని పేర్కొన్నారు.
News November 24, 2024
విద్యార్థుల జీవితాలతో సర్కార్ చెలగాటం: జగన్
AP: ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించకుండా కూటమి సర్కార్ విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోందని మాజీ సీఎం వైఎస్ జగన్ మండిపడ్డారు. విద్యార్థులపై చంద్రబాబు కక్షగట్టారని ఆయన విమర్శించారు. ‘అమ్మఒడి, ఇంగ్లిష్ మీడియం, టోఫెల్, ట్యాబులు, బైజూస్ కంటెంట్, నాడు-నేడును బాబు రద్దు చేశాడు. వైసీపీ హయాంలో తల్లుల ఖాతాలకే వసతి, విద్యా దీవెన జమ చేసేవాళ్లం. ఇప్పుడు అది కూడా లేకుండాపోయింది’ అని ఆయన ఫైర్ అయ్యారు.