News June 5, 2024

DCCB ఛైర్మన్ పదవికి కామిరెడ్డి రాజీనామా

image

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వైసీపీకి ఘోర ఓటమి ఎదురైంది. దీంతో ఆ పార్టీ ద్వారా సంక్రమించిన పదవులకు పలువురు రాజీనామా చేస్తున్నారు. తాజాగా నెల్లూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(DCCB) ఛైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ తన పదవికి రిజైన్ చేశారు. ఎస్సీ రిజర్వ్ అయిన సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఆయన కీలక నేతగా వ్యహరించారు. జగన్‌తోనూ ఆయనకు నేరుగా సంబంధాలు ఉన్న విషయం తెలిసిందే.

Similar News

News November 12, 2024

జగన్ ప్రవర్తన సిగ్గుచేటు: ఆనం

image

వైసీపీ అధినేత జగన్ అసెంబ్లీకి ఎందుకు రారని AP స్టేట్ ఆక్వా కల్చర్ డెవలప్‌మెంట్ అథారిటీ ఛైర్మన్ ఆనం వెంకటరమణారెడ్డి ప్రశ్నించారు. 39.37 శాతం మంది ప్రజల మనోభావాలను ఆయన అవమానిస్తున్నారన్నారు. ప్రతి పక్షా హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాననడం సిగ్గుచేటన్నారు. జగన్ వెంట ఆ పార్టీ MLAలు సైతం నడవడం బాధాకరమన్నారు. జగన్ అసెంబ్లీకి వచ్చి రాష్ట్ర అభివృద్ధికి విలువైన సూచనలు ఇవ్వాలని కోరారు.

News November 12, 2024

అక్కంపేట కురిచర్లపాడు మధ్య రాకపోకలు బంద్

image

అక్కంపేట కురిచర్లపాడు మధ్యలో కల్వర్ట్ కుంగడంతో అక్కంపేట, కురిచర్లపాడు కసుమూరు మీదుగా నెల్లూరు రాకపోకలు నిలిచిపోయాయి. మంగళవారం తెల్లవారుజామున నుంచి తేలికపాటి వర్షాలు ప్రారంభమయ్యాయి. ఇక్కడ పొట్టేలు కాలవ వంతెనకు ముందు పొలాల వద్ద ఉన్న కల్వర్ట్ మంగళవారం మధ్యాహ్నం కుంగిపోయింది. రాకపోకలకు విఘాతం ఏర్పడింది. దీంతో గ్రామస్థులు ముళ్లకంప వేసి రాకపోకలు బంద్ చేశారు.

News November 12, 2024

వృద్ధురాలి హత్య కేసులో మరో నిందితురాలి అరెస్ట్

image

నెల్లూరులో ఎం.రమణి అనే వృద్ధురాలి హత్యకేసులో మూడో నిందితురాలిని సంతపేట పోలీసులు అరెస్ట్ చేశారు. సూట్ కేస్‌లో మ‌ృతదేహంతో చెన్నైలో పట్టుబడిన నిందితుడు బాలసుబ్రమ్మణంను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారించగా బంగారు ఆభరణాల కోసమే తాను, తన భార్య సత్యవతి, కుమార్తెతో కలిసి వృద్ధురాలిని హత్య చేసినట్లు వెల్లడించాడు. దీంతో తండ్రిని, కుమార్తెను అరెస్ట్ చేశారు. కేసు మార్పు చేసి సత్యవతిని అరెస్ట్ చేశారు.