News March 21, 2024

DCCB ఛైర్మన్ పదవీకి పోచారం భాస్కర్ రెడ్డి రాజీనామా!

image

నిజామాబాద్ జిల్లా డీసీసీబీ ఛైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. లేఖను సహకారశాఖ కమిషనర్‌కు పంపుతున్నట్లు ప్రకటించారు. కాగా తనపై డైరెక్టర్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడాన్ని సవాల్ చేస్తూ భాస్కర్ రెడ్డి ఇటీవల హైకోర్టును ఆశ్రయించగా కోర్టు స్టే ఇవ్వలేదు. రాజీనామా లేఖ తమకు అందలేదని జిల్లా సహకార అధికారి శ్రీనివాస్‌రావు వెల్లడించారు. కాగా రేపు అవిశ్వాసం పై ఓటింగ్ జరగనుంది.

Similar News

News September 19, 2024

NZB: పాము కాటేస్తోంది.. జర భద్రం..!

image

వర్షాకాలం ఉండడంతో పాముల సంచారం అధికమైంది. పాము కాటుకు గురై.. మృతి చెందుతున్న ఘటనలు నిజామాబాద్ జిల్లాలో ఏదో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. గడ్డి పొదలు, పొలం గట్లను స్థావరం చేసుకుని ఉన్న పాములు రైతులను కాటేస్తున్నాయి. ఎక్కువ శాతంమంది నాటువైద్యంపై ఆధారపడి.. ప్రాణాలు కాపాడే విలువైన సమయాన్ని చేజేతులా జారవిడుస్తున్నారు. వైద్యాధికారులు ప్రజలకు అవగాహన కల్పించడం లేదన్న అపవాదు ఉంది.

News September 19, 2024

బాక్సర్ నిఖత్ జరీన్‌కు డీఎస్పీ పోస్టు

image

నిజామాబాద్‌కు చెందిన ప్రముఖ బాక్సింగ్ క్రీడాకారిణి నిఖత్ జరీన్ కు రాష్ట్ర ప్రభుత్వం డీఎస్పీ పోస్టు ఇచ్చింది. ఈమేరకు బుధవారం రాష్ట్ర డీజీపీ జితేందర్ నిఖత్ జరీన్‌కు డీఎస్పీగా నియామక ఉత్తర్వులు అందజేశారు. ఇటీవల జరిగిన అంతర్జాతీయ బాక్సింగ్ చాంపియన్ షిప్ పోటీల్లో ఆమె ఛాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు గ్రూప్ 1 పోస్టు అయిన డీఎస్పీగా నిఖత్ జరీన్ నియమించింది.

News September 18, 2024

ఉమ్మడి NZB జిల్లాలోనే రికార్డ్ స్థాయిలో లడ్డూ వేలం ఎక్కడంటే..?

image

ఉమ్మడి NZB జిల్లాలోనే కనీవినీ ఎరగని రీతిలో రికార్డ్ స్థాయిలో గణేశ్ లడ్డూ వేలం జరిగింది. పిట్లంలోని ముకుందర్ రెడ్డి కాలనీ గణపయ్య చేతిలోని లడ్డూ.. ఏకంగా రూ.501,000 లక్షలు పలికింది. పిట్లం కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీపీ సరిత, సూరత్ రెడ్డి ఈలడ్డూను సొంతం చేసుకున్నారు. గతేడాది ఇక్కడి లడ్డూ 3.60 లక్షలు పలికింది. మీ గ్రామాల్లో వినాయక మండపాల్లో వేలం పలికిన లడ్డూ ధరను కామెంట్‌లో తెలుపండి.