News February 24, 2025
ఆ మందులపై నిషేధం విధించిన డీసీజీఐ

పెయిన్ కిల్లర్లుగా ఉపయోగించే టపెంటడాల్, కారిసొప్రాడల్ మందుల మిశ్రమ ఉత్పత్తి, ఎగుమతులను నిషేధిస్తూ డీసీజీఐ ఉత్తర్వులు జారీ చేసింది. ముంబైకి చెందిన ఓ సంస్థ ఆమోదం లేని మందుల్ని తయారు చేసి పశ్చిమాఫ్రికాకు ఎగుమతి చేస్తోందనే కథనాల ఆధారంగా తక్షణమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఈ కాంబినేషన్లో ఉత్పత్తి చేసేందుకు ఇచ్చిన లైసెన్స్‌లు, NOCని వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.
Similar News
News February 24, 2025
ఖజానా ఖాళీ..! డబ్బులు ఇల్లె..!!

దేశంలో ఇటీవల కొత్తగా ముఖ్యమంత్రులు అయిన వారంతా చెబుతున్న మాటలివి. పథకాలు అమలు చేద్దామన్నా, ఆర్థికపర నిర్ణయాలు తీసుకుందామన్నా ఖజానా ఖాళీ అయింది అని మొన్న తెలంగాణ సీఎం రేవంత్, నిన్న ఏపీ సీఎం చంద్రబాబు, నేడు ఢిల్లీ సీఎం రేఖ అంటున్నారు. ఇందుకు చెప్పే కామన్ కారణం గత పాలకుల నిర్ణయాలు. రేపటి పాలకులు ఈ మాట చెప్పొద్దంటే కనీస అవసరాలు కాని ఉచితాలు ఆపేయడమే పరిష్కార మార్గం. నేతలు ఈ నిర్ణయం తీసుకోగలరా?
News February 24, 2025
తండ్రి చనిపోయిన దు:ఖంలోనూ రచయితకు ప్రభాస్ సాయం!

హీరో ప్రభాస్‌పై ‘బిల్లా’ రచయిత తోట ప్రసాద్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ‘నేను 2010 FEBలో ఆస్పత్రిపాలయ్యా. అదేరోజు ప్రభాస్ గారి తండ్రి సూర్య నారాయణ రాజు గారు చనిపోయారు. దుఖంలో ఉన్నప్పటికీ ఆయన నా వైద్యం కోసం డబ్బులు పంపించి హెల్ప్ చేశారు. నాపట్ల అంత కేర్ తీసుకున్నారాయన. తండ్రిని కోల్పోయినప్పటికీ నా సినిమా రైటర్ అని నా గురించి ఆలోచించారు’ అని తనకు ప్రభాస్ చేసిన సాయంపై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.
News February 24, 2025
వంశీపై పీటీ వారెంట్

AP: గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో జైలులో ఉన్న వైసీపీ నేత వల్లభనేని వంశీపై పోలీసులు పీటీ వారెంట్ జారీ చేశారు. రేపటితో రిమాండ్ ముగియనుండటంతో సీఐడీ కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. ఆయనపై మరిన్ని పాత కేసులను ఓపెన్ చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. కస్టడీలో ఉన్న వ్యక్తిపై మరో కేసు నమోదు చేస్తే కోర్టులో ప్రవేశపెట్టడానికి ముందు పీటీ వారెంట్ జారీ చేస్తారు.