News February 2, 2025
DCMS బిజినెస్ మేనేజర్ వెంకటస్వామి రాజీనామా

జిల్లా కో-ఆపరేటివ్ మార్కింగ్ సొసైటీ (డీసీఎంఎస్) బిజినెస్ మేనేజర్ వెంకటస్వామి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని ఇన్‌ఛార్జి జాయింట్ కలెక్టర్ కార్తీక్‌కు అందజేశారు. ఔట్సోర్సింగ్ విధానంలో అనేకమంది వద్ద డబ్బులు తీసుకున్నారన్న ఆరోపణలు నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అవుట్సోర్సింగ్ సిబ్బందిని తొలగిస్తున్న క్రమంలో ఈ రాజీనామా ప్రాధాన్యత సంతరించుకుంది.
Similar News
News February 16, 2025
జగన్ 2.O పాలనలో అందరి లెక్కలు తేలుస్తా: కాకాణి

జగన్ 2.O ప్రభుత్వం రాగానే అతిగా ప్రవర్తించే వారందరి లెక్కలు తేల్చుతామని మాజీ మంత్రి కాకాణి హెచ్చరించారు. పొదలకూరు(M) బిరుదవోలులో శనివారం ఆయన పర్యటించారు. కూటమి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో జగన్ తిరిగి ముఖ్యమంత్రి కావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నాయకులు ధైర్యంగా ఉండాలని, పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని కాకాణి హామీ ఇచ్చారు.
News February 16, 2025
నెల్లూరు: ఇంటర్ విద్యార్థులను ఇబ్బంది పెడితే చర్యలు

నెల్లూరు జిల్లాలో ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు శనివారం నుంచి ప్రారంభమైనట్లు ఆర్ఐఓ డాక్టర్ ఏ శ్రీనివాసులు తెలిపారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. బోర్డు నిబంధనలకు అనుగుణంగా పరీక్షలు నిర్వహించాలని ఎగ్జామినర్ చీఫ్ అడిషనల్ సూపర్డెంట్‌ను ఆదేశించారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా విద్యార్థులను ఇబ్బంది పెడితే ఆ కళాశాలపై చర్యలు తప్పవన్నారు.
News February 15, 2025
చంద్రబాబు హామీలు పేపర్లకే పరిమితం: కాకాణి

చంద్రబాబు రైతు భరోసా కేంద్రాలను నిర్వీర్యం చేస్తున్నాడని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. శనివారం జిల్లా వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. కేవలం జగన్మోహన్ రెడ్డికి పేరు రాకూడదనే ఉద్దేశంతోనే వైసీపీ తీసుకొచ్చిన అనేక సంక్షేమ పథకాలు నీరుగారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబు హామీలన్నీ పేపర్లకే పరిమితమయ్యాయని ఎద్దేవా చేశారు.