News April 14, 2025

DCvsMI: అక్షర్ పటేల్‌కు రూ.12 లక్షల ఫైన్

image

IPL: ముంబై చేతిలో ఓటమితో బాధలో ఉన్న ఢిల్లీ కెప్టెన్‌ అక్షర్ పటేల్‌కు మరో షాక్ తగిలింది. స్లో ఓవర్ రేట్ కారణంగా BCCI రూ.12 లక్షల ఫైన్ విధించింది. ఈ సీజన్‌లో జరిమానా పడిన ఆరో కెప్టెన్‌గా నిలిచారు. ఈ జాబితాలో పరాగ్, శాంసన్(RR), పాండ్య(MI), పంత్(LSG), పాటీదార్(RCB) ఉన్నారు. కాగా 3సార్లు స్లో ఓవర్ రేట్ మెయింటేన్ చేస్తే కెప్టెన్‌పై ఓ మ్యాచ్ బ్యాన్ విధించే నిబంధనను బీసీసీఐ తొలగించిన విషయం తెలిసిందే.

Similar News

News April 16, 2025

అత్యంత ఎత్తైన బ్రిడ్జిపై వందేభారత్ రైలు.. ప్రారంభించనున్న మోదీ

image

వైష్ణోదేవి కట్రా-శ్రీనగర్ మధ్యలో ఉన్న చినాబ్ రైల్వే బ్రిడ్జికి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైలు వంతెనగా పేరొంది. దీనిపై ఇక వందేభారత్ రైలు ప్రయాణం సాగించనుంది. న్యూఢిల్లీ నుంచి కశ్మీర్‌కు సరాసరి నడిచే వందేభారత్ రైలును ఈ నెల 19న మోదీ ప్రారంభించనున్నారు. ప్రస్తుతం కట్రా-శ్రీనగర్ మధ్య రోడ్డు ప్రయాణం 7 గంటలుండగా అది 3గంటలకు తగ్గనుంది. ఇది జమ్మూను కశ్మీర్‌ను అనుసంధానించే తొలి రైల్వే లైన్ కావడం విశేషం.

News April 16, 2025

శ్రీశైలంలో అమ్మవారికి వైభవంగా కుంభోత్సవం

image

AP: శ్రీశైల భ్రమరాంబ అమ్మవారి కుంభోత్సవం వైభవంగా జరిగింది. ఏటా ఛైత్ర మాసంలో సాత్విక బలి పేరుతో ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఆలయంలో 5వేల గుమ్మడి కాయలు, 5వేల టెంకాయలు, లక్షకు పైగా నిమ్మకాయలతో ఆలయ అధికారులు ఘనంగా వేడుక జరిపారు. ఈ సందర్భంగా భక్తులకు అమ్మవారి నిజరూప దర్శన భాగ్యం కలిగింది. అంతకముందు అన్నం, పెసరపప్పు రాశులుగా పోసి ప్రదోషకాల పూజలు నిర్వహించారు.

News April 16, 2025

ఏప్రిల్ 16: చరిత్రలో ఈరోజు

image

1848: సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు(ఫొటోలో) జననం
1889: హాస్యనటుడు చార్లీ చాప్లిన్ జననం
1910: సాహితీవేత్త ఎన్ఎస్ కృష్ణమూర్తి జననం
1914: చిత్రకారుడు కేహెచ్ ఆరా జననం
1951: హాస్యనటుడు ఎంఎస్ నారాయణ జననం
1853: భారత్‌లో తొలి పాసింజర్ రైలును బ్రిటిష్ ప్రభుత్వం ప్రారంభించింది

error: Content is protected !!