News April 27, 2024
గాజాలో బాంబులు తొలగించడానికి 14ఏళ్లు పడుతుంది: UN మాజీ అధికారి

ఇజ్రాయెల్ దాడులతో గాజా అస్తవ్యస్తమైన సంగతి తెలిసిందే. నగరం అంతా పేలని బాంబులు, భవనాల శిథిలాలతో నిండిపోయింది. ప్రతి చదరపు మీటరుకు సగటున 300కిలోల శిథిలాలు ఉన్నాయట. గాజా వ్యాప్తంగా 37 మెట్రిక్ టన్నుల (37వేల కిలోలు) శిథిలాలు ఉన్నట్లు UN మాజీ అధికారి వెల్లడించారు. వీటిని తొలగించడానికి 14ఏళ్లు పడుతుందని వెల్లడించారు. బాంబులు ఉన్న నేపథ్యంలో శిథిలాలను తొలగించడం సవాల్తో కూడుకున్నదని తెలిపారు.
Similar News
News November 22, 2025
‘యాషెస్’ను అసూయతో చూశా: సౌతాఫ్రికా కెప్టెన్

5 టెస్టుల యాషెస్ సిరీస్ను చూస్తే అసూయగా ఉందని సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా అన్నారు. ఇండియాతో టెస్టు సిరీస్ 2 మ్యాచులకే పరిమితం చేయడంపై ఇలా అసంతృప్తి వ్యక్తంచేశారు. ‘యాషెస్ను చూడటానికి ఉదయాన్నే మేం లేచాం. వాళ్లు 5 టెస్టులు ఆడుతున్నారని తెలిసి అసూయతో చూశాం’ అని చెప్పారు. త్వరలో పరిస్థితి మారుతుందని అనుకుంటున్నామని తెలిపారు. భవిష్యత్తులో భారత్తో 4 టెస్టుల సిరీస్ ఆడేందుకు వస్తామని పేర్కొన్నారు.
News November 22, 2025
ఈనెల 24న ఆన్లైన్ జాబ్ మేళా

AP: పార్వతీపురం మన్యం జిల్లాలోని ఎంప్లాయిమెంట్ ఆధ్వర్యంలో ఈనెల 24న ఆన్లైన్ జాబ్ మేళా నిర్వహించనున్నారు. 7 కంపెనీలలో 430 పోస్టులను ఇంటర్వ్యూల ద్వారా భర్తీ చేయనున్నారు. 18 సంవత్సరాలు నిండిన టెన్త్, ఐటీఐ, ఇంటర్, డిప్లొమా, గ్రాడ్యుయేషన్, బీఈ పూర్తిచేసిన స్త్రీ, పురుష అభ్యర్థులు అర్హులు. జాబ్ మేళా రిజిస్ట్రేషన్ లింక్ : https://forms.gle/vtBSqdutNxUZ2ESX8