News September 1, 2025

డివిలియర్స్ టాప్-5 టెస్ట్ క్రికెటర్స్ వీరే.. కోహ్లీకి నో ఛాన్స్

image

సౌతాఫ్రికా క్రికెట్ దిగ్గజం ఏబీ డివిలియర్స్ తన ఫేవరెట్ టాప్-5 టెస్ట్ క్రికెటర్లను ప్రకటించారు. జాక్వెస్ కల్లిస్(SA), ఆండ్రూ ఫ్లింటాఫ్(ENG), మహమ్మద్ ఆసిఫ్(PAK), షేన్ వార్న్(AUS), సచిన్ టెండూల్కర్(IND)లను ఎంపిక చేశారు. కాగా తన ఫేవరెట్ క్రికెటర్ల లిస్టులో విరాట్‌ను ఎంపిక చేయనందుకు ఏబీడీ క్షమాపణలు చెప్పడం విశేషం. RCB ప్లేయర్లయిన కోహ్లీ, ఏబీడీ క్లోజ్ ఫ్రెండ్సనే విషయం తెలిసిందే.

Similar News

News February 2, 2026

నాని ‘ప్యారడైజ్’ విడుదల వాయిదా?

image

నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘ప్యారడైజ్’ మూవీ రిలీజ్ వాయిదా పడనున్నట్లు తెలుస్తోంది. మార్చిలో రిలీజ్ కావాల్సి ఉండగా ఈ మూవీ జూన్‌లో విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి. ఒకవేళ ఏమైనా ఆలస్యం జరిగితే జులైలో రిలీజయ్యే అవకాశముందని వెల్లడించాయి. అయితే దీనిపై మూవీ యూనిట్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన లేకపోవడం గమనార్హం.

News February 2, 2026

నేషనల్ ఏరోస్పేస్ లాబోరేటరీస్‌లో 47 పోస్టులు

image

బెంగళూరులోని<> CSIR<<>>-నేషనల్ ఏరోస్పేస్ లాబోరేటరీస్ 47 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. గ్రాడ్యుయేట్(BE, BTech), డిప్లొమా అర్హత గలవారు ముందుగా NATS పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. గ్రాడ్యుయేట్ ట్రైనీలకు FEB 10న, డిప్లొమా ట్రైనీలకు FEB11న ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు. గ్రాడ్యుయేట్లకు నెలకు రూ.12,300, డిప్లొమా ట్రైనీలకు రూ.10,900 చెల్లిస్తారు. సైట్: https://www.nal.res.in/

News February 2, 2026

రూ.20,000 తగ్గిన సిల్వర్ రేటు

image

వెండి ధరలు మరోసారి కుప్పకూలాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఈ ఒక్కరోజే కేజీ వెండి ధర రూ.20 వేలు తగ్గింది. దీంతో కేజీ సిల్వర్ రేటు ప్రస్తుతం రూ.3,00,000 పలుకుతోంది. కాగా 4 రోజుల్లోనే వెండి ధర రూ.1.25 లక్షలు తగ్గడం గమనార్హం.